ఓ రంగుల చిలుక...పాటకు వస్తున్న స్పందనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నా -వర్ధమాన గాయని స్పందన

  • IndiaGlitz, [Saturday,October 15 2016]

జయమ్ము నిశ్చయమ్మురా సినిమాలో తాను పాడిన ఓ రంగుల చిలుక... పాటకు వస్తున్న స్పందన తనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నదని, సింగర్ గా తనన కెరీర్ కి ఈ పాట టర్నింగ్ పాయింట్ అవుతుందని తాను భావిస్తున్నానని వర్ధమాన గాయని స్పందన చెబుతోంది.
శ్రీనివాస్ రెడ్డి-పూర్ణ జంటగా శివరాజ్ కనుమూరి తనే నిర్మిస్తూ.. దర్శకత్వం వహిస్తున్న చిత్రం జయమ్ము నిశ్చయమ్మురా. ఈ చిత్రం కోసం ఓ రంగుల చిలుక.. చూడే నీ ఎనకా.. అలుపంటూ లేని ఈ పిల్లడి నడక... అనే పల్లవితో మొదలయ్యే పాటను స్పందన ఆలపించింది. ఓ మళయాళ గీతం గుంచి ప్రేరణ పొంది.. రవిచంద్ర స్వర సారధ్యంలో రూపొందిన ఈ గీతానికి రామాంజనేయులు సాహిత్యం సమకూర్చగా.. కార్తీక్ రోడ్రగ్జ్ రీమిక్స్ చేశారు. ఆడియో గ్యారేజ్ లో మాస్టరింగ్ జరుపుకున్న ఈ గీతాన్ని ఇషిత్ కుబేకర్ మిక్స్ చేయగా.. హరిప్రియ-అశ్విని-షబీనా శివరంజని కోరస్ అందించారు. ఇటీవల ఈ గీతాన్ని ఆవిష్కరించిన ప్రముఖ దర్శకులు సుకుమార్.. ఈ పాట చూసి ఎంతగానో ఇంప్రెస్ అయ్యి.. చిత్ర దర్శకుడు శివరాజ్ కనుమూరి తదుపరి చిత్రాన్ని తన బ్యానర్ "సుకుమార్ రైటింగ్స్"లో నిర్మిస్తానని ప్రకటించారు. ఓ రంగుల చిలుక పాట పాడేప్పుడు.. తన కెరీర్ లో ఇదో మంచి పాట అవుతుందని తాను భావించినప్పటికీ.. ఈ స్థాయి స్పందన మాత్రం తాను ఊహించలేదని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న స్పందన.. ఇంత మంచి పాట పాడే అవకాశం ఇచ్చిన సంగీత దర్శకులు రవిచంద్ర-కార్తీక్ లకు.. దర్శకనిర్మాత శివరాజ్ కనుమూరి, గీత రచయిత రామాంజనేయులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటోంది.
సమైక్యంగా నవ్వుకుందాం అనే ట్యాగ్ లైన్ తో.. దేశవాళీ వినోదం అనే స్లోగన్ తో.. అందరి దృష్టినీ అమితంగా ఆకర్షిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా నవంబర్ విడుదలకు సిద్ధమవుతోంది.

More News

తేజు విన్న‌ర్ ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది..!

మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఠాగూర్ మ‌ధు, న‌ల్ల‌మ‌ల‌పు బుజ్జి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

రంగం రేంజ్ లో విజయం సాధించే రంగం-2 -'సోగ్గాడే చిన్ని నాయనా' ఫేం కళ్యాణ్ కృష్ణ

జీవా-తులసీనాయర్ జంటగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి.కె.చంద్రన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం రంగం 2. జస్రాజ్ ప్రొడక్షన్స్ సమర్పణలో` శ్రీలక్ష్మిజ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఎ ఎన్.బాలాజి (సూపర్గుడ్ బాలాజి) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నందినీ న‌ర్సింగ్ హోమ్ సెన్సార్ పూర్తి..!

ప్ర‌ముఖ ద‌ర్శ‌కురాలు విజ‌య‌నిర్మ‌ల మ‌న‌వ‌డు న‌వీన్ వికె హీరోగా పి.వి గిరి తెర‌కెక్కించిన చిత్రం నందిని న‌ర్సింగ్ హోమ్. ఈ టైటిల్ కి ఇక్క‌డ అంతా క్షేమ‌ము అనేది ట్యాగ్ లైన్. న‌వీన్, నిత్యా, శ్రావ్య హీరో, హీరోయిన్స్ గా న‌టించిన నందిని న‌ర్సింగ్ హోమ్ చిత్రాన్ని ఎస్.వి.పి ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై రాధా కిషోర్ జి, భిక్ష‌మ‌య్య సంగం సం&

గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి - 2 మిలియ‌న్ హిట్స్..!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ న‌టిస్తున్న వంద‌వ చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి. ఈ భారీ చిత్రాన్ని జాగ‌ర్ల‌మూడి క్రిష్ తెర‌కెక్కిస్తున్నారు. ద‌స‌రా కానుక‌గా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి టీజ‌ర్ రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే.

సాయిధరమ్ తేజ్ బర్త్ డే స్పెషల్ గా ఫస్ట్ లుక్ రిలీజ్..!

రేయ్,పిల్లానువ్వులేని జీవితం,సుబ్రమణ్యం ఫర్ సేల్,సుప్రీమ్ చిత్రాలతో సక్సెస్ సాధించిన యంగ్ హీరో సాయిధరమ్ తేజ్.