రంగస్థలం..రెండు చిరు సినిమాలు

  • IndiaGlitz, [Friday,December 15 2017]

పాత సినిమాల స్ఫూర్తితో కొత్త చిత్రాలు తెర‌కెక్క‌డం ప‌రిశ్ర‌మ‌లో చాలా సాధార‌ణ‌మైన అంశ‌మే. అలా కొత్త త‌ర‌హాలో వ‌చ్చిన ఆ పాత క‌థ‌లు మంచి విజ‌యాన్ని అందించిన సంద‌ర్భాలు అనేకం. ఇలాంటి జాబితాలో మ‌రో చిత్రం చేర‌నుంది. ఆ సినిమానే రంగ‌స్థ‌లం. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అందాల న‌టి స‌మంత ఇందులో డీ గ్లామ‌ర్ లుక్‌లో సంద‌డి చేయ‌నుంది.

ఇదిలా ఉంటే.. మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా రూపొందిన రెండు పాత సినిమాల ఛాయ‌ల‌తో రంగ‌స్థ‌లం తెర‌కెక్కుతోంద‌ని క‌థనాలు వినిపిస్తున్నాయి. 1981లో చిరంజీవి, సుధాక‌ర్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఊరికిచ్చిన మాట‌.. అలాగే 1983లో చిరంజీవి, సుమ‌ల‌త‌, రంగనాథ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఆల‌య‌శిఖ‌రం షేడ్స్ రంగ‌స్థ‌లంలో ఉంటాయ‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచార‌మ్‌. ఆ రెండు చిత్రాల‌లాగే రంగ‌స్థ‌లంలోనూ అన్న‌ద‌మ్ముల మ‌ధ్య జ‌రిగే సంఘ‌ర్ష‌ణ సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ అవుతుంద‌ని తెలిసింది. ఇందులో చ‌ర‌ణ్ అన్న‌య్య‌గా ఆది పినిశెట్టి న‌టిస్తున్నాడు. మార్చి 30న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

More News

రెండు తేదీలు.. ఎనిమిది జోన‌ర్స్‌

సంక్రాంతి పండగ వచ్చిందంటే సాధారణ ప్రజానీకం నుంచి సినీ ఇండస్ట్రీ వరకు అందరికీ పండగే. ఈ సంక్రాంతికి పవన్ కల్యాణ్, బాలకృష్ణ, రవితేజ వంటి అగ్ర క‌థానాయ‌కుల‌తో పాటు తమిళ స్టార్ హీరో సూర్య కూడా తెలుగుతెరపై సందడి చేయనున్నారు.

జై సింహా చిత్రీకరణ పూర్తి - జనవరి 12న విడుదల

నందమూరి బాలకృష్ణ,నయనతార,నటాషా జోషి,హరిప్రియ ప్రధాన పాత్రధారులుగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో

విష్ణుకిదే తొలిసారి..

గతంలో మన తెలుగు కథానాయకులు సంవత్సరానికి నాలుగు లేదా ఐదు సినిమాలతో సందడి చేసేవారు.

శివకాశీపురం సాంగ్ లాంచ్ చేసిన తెలంగాణ ఎఫ్ డిసి చైర్మన్

సాయి హరీశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్ పై మాస్టర్ హరి సమర్పణలో హరీష్ వట్టి కూటి ని దర్శకుడిగా పరిచయం చేస్తూ మోహన్ బాబు పులిమామిడి నిర్మిస్తున్న చిత్రం  'శివకాశీపురం'. స్వర్గీయ స్వర చక్రవర్తి మనవడు , శ్రీ తనయుడు అయిన రాజేష్ శ్రీ చక్రవర్తి ని ఈ చిత్రంతో హీరోగా పరిచయం చేస్తున్నారు .

అంజలి ప్రధాన పాత్రలో, రాయ్ లక్ష్మి కీలక పాత్రలో ఆర్ కె స్టూడియోస్ బ్యానర్ ద్విభాషా చిత్రం

గుంటూరు టాకీస్,రాజా మీరు కేక వంటి వినోదాత్మక చిత్రాలను,షూటింగ్ దశలో ఉన్న పవనిజం-2 వంటి చిత్రాలను తెరకెక్కించిన