రాజకీయాలను టచ్ చేస్తున్న 'రంగస్థలం'
Send us your feedback to audioarticles@vaarta.com
ఏదైనా సమాచారం గురించి తెలుసుకోవాలంటే.. ఇప్పుడైతే చాలా మాధ్యమాలు ఉన్నాయి. కాని 25-30 సంవత్సరాల క్రితం రేడియో ఒక్కటే ఆధారం. అప్పుడు ఏదైనా సమాచారం తెలుసుకోవాలంటే...ప్రత్యేకించి రాజకీయాల గురించి వినాలంటే ఒక పల్లెటూరుకి వెళితే సరిపోతుంది. ఓ పల్లెటూరు.. ఆ ఊరి మధ్యలో ఓ రచ్చబండ.. అక్కడ జరిగే రాజకీయ ముచ్చట్లు.. చాలా ఆశ్చర్యంగాను, ఆసక్తికరంగాను ఉంటాయి. అచ్చం ఇలాంటి రాజకీయాలను ముచ్చటించుకునే పల్లెటూరి వాతావరణాన్ని తన సినిమా రంగస్థలం`లో చూపించబోతున్నారు దర్శకుడు సుకుమార్.
1985ల నాటి అందమైన ప్రేమకథను రామ్ చరణ్, సమంతల మధ్య చూపిస్తూనే....అంతర్లీనంగా రాజకీయాలను కూడా టచ్ చేసారని కథనాలు వినిపిస్తున్నాయి. అప్పటి రాజకీయ పరిస్థితులను వెండితెరపై చూపిస్తూనే....మండల స్థాయిలో జరిగే ఎన్నికలకి సంబంధించి వచ్చే సన్నివేశాలను ఆసక్తిని పెంచే విధంగా దర్శకుడు రూపొందించారని చిత్ర వర్గాలు వెల్లడిస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 30న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments