రాజకీయాలను టచ్ చేస్తున్న 'రంగస్థలం'

  • IndiaGlitz, [Saturday,February 17 2018]

ఏదైనా సమాచారం గురించి తెలుసుకోవాలంటే.. ఇప్పుడైతే చాలా మాధ్యమాలు ఉన్నాయి. కాని 25-30 సంవత్సరాల క్రితం రేడియో ఒక్కటే ఆధారం. అప్పుడు ఏదైనా సమాచారం తెలుసుకోవాలంటే...ప్రత్యేకించి రాజకీయాల గురించి వినాలంటే ఒక పల్లెటూరుకి వెళితే సరిపోతుంది. ఓ పల్లెటూరు.. ఆ ఊరి మధ్యలో ఓ రచ్చబండ.. అక్కడ జరిగే రాజకీయ ముచ్చట్లు.. చాలా ఆశ్చర్యంగాను, ఆసక్తికరంగాను ఉంటాయి. అచ్చం ఇలాంటి రాజకీయాలను ముచ్చటించుకునే పల్లెటూరి వాతావరణాన్ని తన సినిమా రంగస్థలం'లో చూపించబోతున్నారు దర్శకుడు సుకుమార్.

1985ల నాటి అందమైన ప్రేమకథను రామ్ చరణ్, సమంతల మధ్య చూపిస్తూనే....అంతర్లీనంగా రాజకీయాలను కూడా టచ్ చేసారని క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. అప్పటి రాజకీయ పరిస్థితులను వెండితెరపై చూపిస్తూనే....మండల స్థాయిలో జరిగే ఎన్నికలకి సంబంధించి వచ్చే సన్నివేశాలను ఆసక్తిని పెంచే విధంగా దర్శకుడు రూపొందించారని చిత్ర వర్గాలు వెల్లడిస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 30న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.

More News

'ఇష్టంగా.. సంతోషంగా..ఆనందంగా' అంటున్న ర‌చ‌యిత‌

కథా రచయితలు దర్శకులుగా మారడం అన్నది తెలుగు సినీ పరిశ్రమకు కొత్తేమీ కాదు. నిన్నటి తరం సీనియర్ దర్శకులు దాసరి నారాయణరావు, జంధ్యాల నుంచి నేటి తరం డైరెక్టర్ వక్కంతం వంశీ వరకు చాలా మంది రచయితలుగా కెరీర్‌ను ఆరంభించి అనంత‌రం దర్శకులుగా రూపాంతరం చెందినవారే.

ముచ్చటగా మూడోసారి నానితో..

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నారు నిర్మాత దిల్ రాజు.

'ఐతే 2.ఓ' మోషన్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

ఇంద్రనీల్‌ సేన్‌గుప్తా, జారా షా, అభిషేక్‌, కర్తవ్య శర్మ, నీరజ్‌, మృణాల్‌, మృదాంజలి కీలక పాత్రధారులుగా రాజ్‌ మాదిరాజు దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ఐతే 2.ఓ'. ఫర్మ్‌ 9 పతాకంపై కె.విజయరామారాజు, హేమంత్‌ వల్లపురెడ్డి నిర్మిస్తున్నారు. శనివారం ప్రసాద్‌ ప్రివ్యూ థియేటర్‌లో ఈ చిత్రం మోషన్‌ పోస్టర్‌, టీజర్‌ను నిర్మాత రాజ్‌ కందుకూరి, దర్శకురా

మలయాళ బ్లాక్ బస్టర్ 'ఆనందం' .. ఇప్పుడు తెలుగులో!

కాలేజీ నేపథ్యంలో కథలు అల్లుకుని యువత మనసులకు హత్తుకునేటట్టు తెరకెక్కించిన ప్రతిసారీ విజయం తథ్యం.

ఆశాభోస్లేకి య‌శ్ చోప్రా జాతీయ అవార్డు ప్ర‌దానం..!

లెజండ‌రి సింగ‌ర్ ఆశాభోస్లేకి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన య‌శ్ చోప్రా మెమురియ‌ల్ జాతీయ అవార్డు 2018ని టి.సుబ్బిరామిరెడ్డి ఫౌండేష‌న్  ఫిబ్ర‌వ‌రి 16న ముంబాయిలోని ఓ ప్ర‌ముఖ హోట‌ల్ లో ప్ర‌దానం చేసారు.