మరో వారం రోజుల్లో 'రంగస్థలం' టైటిల్ సాంగ్

  • IndiaGlitz, [Monday,February 19 2018]

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్, బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం రంగస్థలం'. నిర్మాణం పూర్తిచేసుకున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే “ఎంత సక్కగున్నావే' పాటను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ పాటకి మంచి స్పందన వస్తున్న ఈ తరుణంలో.. మరో వారం తర్వాత టీజర్ ఆఖరిలో వినపడే “రంగా.. రంగస్థలానా” అంటూ వచ్చే టైటిల్ సాంగ్‌ను కూడా రిలీజ్ చేయనున్నట్టు సమాచారం.

అలాగే దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చిన మొత్తం పాటలను.. మార్చి మొదటివారంలో జ్యూక్ బాక్స్ రూపంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ నెల 25 కల్లా ఎడిటింగ్, డిజిటల్ వర్క్ తో పాటు మిగిలిన పనులను కూడా పూర్తి చేసి.. చిత్రాన్ని రీ-రికార్డింగ్‌కు పంపించనున్నారు. అంతేగాకుండా.. మార్చి 18న ముందస్తు విడుదల వేడుకను వైజాగ్ లో నిర్వహించనుంది చిత్ర బృందం. సమంత, ఆది పినిశెట్టి, జగపతి బాబు, అనసూయ ప్రధాన పాత్రల్లో న‌టించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ‌ నిర్మించింది. మార్చి 30న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

More News

పారితోషికం పెంచిన తమన్?

యువ సంగీత దర్శకుడు తమన్ కు 2018 బాగానే కలిసొస్తుందనే చెప్పాలి.ఎందుకంటే..

హాస్యనటడు గుండు హనుమంతరావు కన్నుమూత

గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ప్రముఖ హాస్యనటుడు గుండు హనుమంతరావు ఈరోజు ఉదయం మూడున్నర గంటలకు ఎస్.ఆర్.నగర్ లోని తన స్వగృహంలో కన్నుమూశారు.

మే నుంచి మొదలవ్వనున్న సాయిధరమ్ తేజ్ - గోపీచంద్ మలినేని ప్రొజెక్ట్

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్,కమర్షియల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనిల క్రేజీ కాంబినేషన్ లో

'రా.రా...' ప్రీ రిలీజ్ వేడుక

హీరో శ్రీకాంత్ ,నాజియా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'రా రా' ..

'హైదరాబాద్ లవ్ స్టొరీ' ఫిబ్రవరి 23న రిలీజ్

ఈ వారం విడుదల కానున్న సినిమాలలో ప్రేక్షకులను అలరించే సినిమాగా కనపడుతున్న సినిమా హైదరాబాద్ లవ్ స్టొరీ,