మరో వారం రోజుల్లో 'రంగస్థలం' టైటిల్ సాంగ్
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం రంగస్థలం`. నిర్మాణం పూర్తిచేసుకున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే “ఎంత సక్కగున్నావే` పాటను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ పాటకి మంచి స్పందన వస్తున్న ఈ తరుణంలో.. మరో వారం తర్వాత టీజర్ ఆఖరిలో వినపడే “రంగా.. రంగస్థలానా” అంటూ వచ్చే టైటిల్ సాంగ్‌ను కూడా రిలీజ్ చేయనున్నట్టు సమాచారం.
అలాగే దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చిన మొత్తం పాటలను.. మార్చి మొదటివారంలో జ్యూక్ బాక్స్ రూపంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ నెల 25 కల్లా ఎడిటింగ్, డిజిటల్ వర్క్ తో పాటు మిగిలిన పనులను కూడా పూర్తి చేసి.. చిత్రాన్ని రీ-రికార్డింగ్‌కు పంపించనున్నారు. అంతేగాకుండా.. మార్చి 18న ముందస్తు విడుదల వేడుకను వైజాగ్ లో నిర్వహించనుంది చిత్ర బృందం. సమంత, ఆది పినిశెట్టి, జగపతి బాబు, అనసూయ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. మార్చి 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com