'రంగ‌స్థ‌లం' టీజ‌ర్ వ‌చ్చేస్తుంది...

  • IndiaGlitz, [Tuesday,January 16 2018]

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా మైత్రీ మూవీ మేక‌ర్స్ ప‌తాకంపై రూపొందుతున్న‌ భారీ చిత్రం 'రంగ‌స్థ‌లం'. స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్‌, మోహ‌న్‌(సి.వి.ఎం) నిర్మాత‌లు ఈ ప్రెస్టీజియ‌స్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మార్చి 30న సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది.

విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సుకుమార్ సినిమాను స‌రికొత్తగా తెర‌కెక్కిస్తుండ‌టం.. గుబురు గ‌డ్డం..గ‌ళ్ళ లుంగీ, తువాలుతో ప‌క్కా మాస్ లుక్‌లో క‌న‌ప‌డుతున్న రామ్ చ‌ర‌ణ్‌, ప‌ల్లెటూరి అమ్మాయిగా స‌మంత లుక్స్ అన్నీ సినిమా ఎలా ఉండ‌బోతుందోన‌నే ఆస‌క్తిని ప్రేక్ష‌కుల్లో క‌లిగిస్తున్నాయి. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన లొకేష‌న్ ఫోటోల‌ను రామ్‌చ‌ర‌ణ్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది.

శ్రీమంతుడు, జ‌న‌తాగ్యారేజ్ వంటి భారీ చిత్రాల‌ను నిర్మించిన సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ సినిమాను అన్‌కాంప్ర‌మైజ్డ్ బ‌డ్జెట్‌లో నిర్మిస్తున్నారు. ఇంకా జ‌గ‌ప‌తిబాబు, ప్ర‌కాష్ రాజ్‌, ఆది పినిశెట్టి, అన‌సూయ వంటి స్టార్ కాస్టింగ్‌తో పాటు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం, ర‌త్న‌వేలు సినిమాటోగ్ర‌ఫీ, న‌వీన్ నూలి ఎడిటింగ్ ఇలా బెస్ట్ టెక్నిక‌ల్ టీం క‌ల‌యిక‌లో సుకుమార్ అమేజింగ్ డైరెక్ష‌న్‌లో ఓ మేజిక్ క్రియేట్ చేయ‌బోతున్నార‌నే క్యూరియాసిటీ స‌ర్వ‌త్రా ఏర్ప‌డింది. ఈ క్యూరియాసిటీ రెట్టింపు చేయ‌డానికి ఈ జ‌న‌వ‌రి 24.. సాయంత్రం 4 గంట‌ల 15 నిమిషాల‌కు టీజ‌ర్‌ను విడుద‌ల చేస్తున్నారు.