'రంగస్థలం' టీజర్ ఎప్పుడంటే..
Send us your feedback to audioarticles@vaarta.com
చిట్టిబాబుగా మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ సందడి చేయబోతున్న చిత్రం రంగస్థలం. 1985 నాటి పరిస్థితుల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో చరణ్ డీ గ్లామర్ లుక్‌లో కనిపించనున్నాడు. సమంత కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, ఆది పినిశెట్టి, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అందాలనటి పూజా హెగ్డే ఓ ప్రత్యేక గీతంలో సందడి చేయనుంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆయన ఆస్థాన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. కాగా, ప్రస్తుతం ఈ సినిమా.. చిత్రీకరణ పరంగా తుది దశలో ఉంది.
మార్చి 30న ఈ సినిమాని విడుదల చేయడానికి చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రయత్నాలు చేస్తోంది. ఇదిలా ఉంటే.. ఇటీవలే రంగస్థలం ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసిన చిత్ర బృందం.. ఈ సినిమా టీజర్‌ని సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అంటే.. బాబాయ్ పవన్ కల్యాణ్ తన కొత్త చిత్రం అజ్ఞాతవాసితో సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనుంటే.. అబ్బాయ్ చరణ్ తన కొత్త చిత్రం టీజర్‌తో సందడి చేయనున్నారన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments