ఐటమ్ సాంగ్ పనిలో 'రంగస్థలం'
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, అందాల తార సమంత జంటగా నటిస్తున్న చిత్రం రంగస్థలం`. ఇంటెలిజింట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా 1985 నాటి పరిస్థితులతో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం టాకీ పార్టుని పూర్తిచేసుకుంది. ఇదిలా ఉంటే.. సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ అంటే ఠక్కున గుర్తొచ్చేది వీరి మార్క్ ఐటెం సాంగ్నే. ఈ పాటల్ని చిత్రీకరించడంలో సుకుమార్ పంథాయే వేరు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ఐటెం సాంగ్స్ అన్నీ హిట్ అనే చెప్పాలి.
ఆర్య` సిరీస్ లో వచ్చిన “అ...అంటే అమలాపురం”, “రింగ..రింగా`.. 1-నేనొక్కడినే`లో “లండన్ బాబులు” పాటలు థియేటర్లలో ప్రేక్షకుల చేత స్టెప్పులు వేయించాయి. అలాగే '100 % లవ్'లో 'డియ్యాలో డియ్యాలో' కూడా మంచి హిట్ అయ్యింది. కాగా, రంగస్థలం`లో కూడా ఇటువంటి మ్యాజిక్ ఈ ద్వయం చేయబోతోంది. ఆ పాటల్ని మించిన పాటగా ఈ చిత్రంలోని ఐటెం సాంగ్ ఉండబోతోందని చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ రోజు (సోమవారం) నుంచి ఈ పాటకి సంబంధించిన చిత్రీకరణని కూడా ప్రారంభించారు. జానీ మాస్టర్ కంపోజ్ చేస్తున్న ఈ పాటను 'డీజే' భామ పూజా హెగ్డే పై చిత్రీకరిస్తున్నారు. పూజా స్టెప్పులను తెరపై చూడాలంటే.. మార్చి 30 వరకు వేచి ఉండాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments