రంగస్థలంకి ఇంటర్వెల్ బాంగ్ హైలైట్ అట‌

  • IndiaGlitz, [Thursday,March 29 2018]

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, సమంత జంటగా నటించిన చిత్రం 'రంగస్థలం'. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. గ్రామీణ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని మలిచారు దర్శకుడు. ఆది, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, అనసూయ ప్రధాన పాత్రలు పోషించారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం  బయటకి వచ్చింది. అదేమిటంటే.. ఈ చిత్రం ఇంటర్వెల్ బాంగ్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనీ.. అక్కడ వచ్చే ట్విస్ట్‌తో చరణ్ నటన ఆకట్టుకునేలా ఉంటుందనీ.. ఈ సన్నివేశం ప్రేక్షకులందరినీ అలరిస్తుందనీ సమాచారం.

ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలతో పాటు, దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాట‌లు కూడా ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచేలా చేసాయి. చిరంజీవికి 'ఖైది', 'స్వయంకృషి' ఎలాగో.. చరణ్‌కి ఈ సినిమా అలాగని అందరూ చెప్పడం గమనార్హం. అలాగే.. రత్నవేలు సినిమాటోగ్రఫీ సినిమాని మరోస్థాయికి తీసుకుని వెళ్తుందని చెప్పడంతో.. అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. రేపు (మార్చి 30న) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం.

More News

యంగ్ హీరోతో సుకుమార్ నెక్ట్స్ ప్రాజెక్ట్?

భిన్నమైన కథలతో.. వైవిధ్యమైన కథనంతో సినిమాలను తెరకెక్కించడంలో దిట్ట ద‌ర్శ‌కుడు సుకుమార్.

రాజమౌళికి అరుదెన ఆహ్వానం

'బాహుబలి' సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా స్థాయిని  పెంచిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. ఈ సినిమా మేకింగ్ రాజమౌళి అండ్ టీంకి ఎనలేని పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టింది.

ర‌వితేజ‌కు జంట‌గా...

'నేను శైల‌జ‌', 'నేను లోక‌ల్' చిత్రాల‌తో మంచి విజయాల‌నే సొంతం చేసుకుంది.

త‌మ‌న్నా స్పెష‌ల్ సాంగ్ చేస్తుందా?

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో

పోస్ట్ పోన్ అయిన 'పంతం'...

యాక్షన్ హీరోగా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన గోపీచంద్‌కు 'జిల్' (2015) సినిమాతో విజయాలకు బ్రేక్ పడింది.