ప్రేమికుల రోజు కానుక‌గా 'రంగ‌స్థ‌లం' తొలి పాట‌

  • IndiaGlitz, [Sunday,January 28 2018]

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్ర‌స్తుతం 'రంగస్థలం' చిత్రంలో క‌థానాయ‌కుడిగా నటిస్తున్న‌ విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సమంత కథానాయికగా నటిస్తోంది. రొమాంటిక్ ఎంటర్‌టైన‌ర్‌గా సాగే ఈ గ్రామీణ నేపథ్యపు చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ‌ నిర్మిస్తోంది.

కాగా, ఇటీవల విడుదల చేసిన‌ టీజర్‌ మెగాభిమానులనే గాక...స‌గ‌టు ప్రేక్షకులని కూడా ఆకట్టుకుంది. చ‌ర‌ణ్ చెవిటి యువ‌కుడిగా సంద‌డి చేయ‌నున్న ఈ సినిమా... ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ప‌రంగా తుది ద‌శ‌కు చేరుకుంది. ఇదిలా ఉంటే.. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమాలోని మొదటి పాటను ఫిబ్రవరి 13న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందని స‌మాచార‌మ్‌.

అలాగే దేవిశ్రీ ప్రసాద్ స్వరాలను సమకూర్చిన ఈ సినిమాలోని మిగిలిన పాటలను మార్చి మొదటి వారంలో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. వేస‌వి బ‌రిలో నిలిచే తొలి చిత్రంగా 'రంగ‌స్థ‌లం' మార్చి 30న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.