'రంగస్థలం'.. డిజిలైట్ రైట్స్ అంత పలికాయా?
Send us your feedback to audioarticles@vaarta.com
1985 కాలం నాటి పరిస్థితులతో.. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథగా 'రంగస్థలం' చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు సుకుమార్. ఇందులో రామ్ చరణ్, సమంత నాయకా నాయికలుగా నటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలతో, పాటలతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్‌తో పాటు డిజిటల్ రైట్స్ వ్యాపారం కూడా భారీగానే జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇంటర్నెట్ విస్తృతంగా అందుబాటులోకి వచ్చాక.. శాటిలైట్‌తో సమానంగా డిజిటల్ రైట్స్ ద్వారా కూడా ఆదాయం వస్తోందని ఈ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాని ప్రముఖ సంస్థ అమెజాన్.. 10కోట్ల రూపాయలు వెచ్చించి మరీ డిజిటల్ హక్కుల్ని సొంతం చేసుకుందని సమాచారం.
ఇంత భారీగా వ్యాపారం జరిగిన ఈ చిత్రం ఏ రేంజ్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలంటే విడుదల తేదీ వరకు వేచి ఉండాల్సిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout