వరుస ఆఫర్లతో 'రంగస్థలం' ఆర్ట్ డైరెక్టర్స్
Send us your feedback to audioarticles@vaarta.com
'రంగస్థలం' సినిమా ఓ గ్రామీణ నేపథ్యంలో సాగిన ప్రేమ కథ. గోదావరీ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకున్న చిత్రం. అయితే స్క్రీన్ పై చూసిన ఆ గ్రామాన్ని.. హైదరాబాద్‌లోనే రెండెకరాల స్థలంలో సెట్ వేశారంటే ఏ ప్రేక్షకుడు నమ్మే పరిస్థితిలో ఉండడు. అంతలా ఆ గ్రామాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు ఆర్ట్ డైరెక్టర్స్ ఎస్.రామకృష్ణ, మోనిక.
ఈ సినిమా విజయానికి రామకృష్ణ, మోనిక కూడా ఓ కారణం కాబట్టి.. ఇప్పుడు వరుస ఆఫర్లు వారిని వెతుక్కుంటూ వస్తున్నాయి. గతంలో రామకృష్ణ, మోనిక చేసిన 'అందాల రాక్షసి', 'సాహసం', 'కేరింత', 'భలే మంచి రోజు', 'ఆనందో బ్రహ్మ', 'యుద్ధం శరణం' చిత్రాల్లో పనితనం నచ్చి.. 'రంగస్థలం'కి పని చేయడానికి ఛాన్స్ ఇచ్చారు సుకుమార్.
ఇప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంతో.. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న 'యన్.టి.ఆర్' చిత్రానికి పనిచేసే అవకాశాన్ని కల్పించారు బాలకృష్ణ. దీంతో పాటు వరుణ్ తేజ్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న సినిమాకి కూడా రామకృష్ణ, మోనిక పనిచేస్తున్నారు.
అంతరిక్ష నేపథ్యంలో సాగే ఈ చిత్రంతో పాటు.. 'యన్.టి.ఆర్' చిత్రం కూడా కెరీర్‌కి మరింత ప్లస్ అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా.. నాగచైతన్య నటిస్తున్న 'సవ్యసాచి' సినిమాతో పాటు చిరంజీవి చిన్న అల్లుడు కల్యాణ్ సినిమాకి కూడా రామకృష్ణ పనిచేస్తున్నారు.
అతని ప్రతిభకి పట్టం కట్టే సినిమాలు వెతుక్కుంటూ రావడం నిజంగా రామకృష్ణ పడిన కష్టానికి నిదర్శనమని చెప్పొచ్చు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments