హీరోతో సమానంగా.. 'రంగస్థలం' నటుడికి బంపర్ ఆఫర్?

  • IndiaGlitz, [Wednesday,June 16 2021]

సపోర్టింగ్ రోల్స్ చేసే నటులకు హీరోలతో సమానంగా పాత్ర దొరకడం చాలా అరుదుగా ఉంటుంది. విలన్ పాత్రలకు లేదా కొన్ని ప్రత్యేకమైన చిత్రాల్లో సహాయ నటులకు మాత్రమే హీరోతో ఈక్వల్ గా ఉండే రోల్ దొరుకుతుంది. నరేష్, సత్యరాజ్, మురళి శర్మ లాంటి నటులు ప్రస్తుతం అలాంటి పాత్రలు దక్కించుకుంటున్నారు.

ఇదీ చదవండి: స్టన్నింగ్ హాట్: పర్పుల్ డ్రెస్ లో మతిపోగొడుతున్న రష్మిక

ఇక కొత్త ట్యాలెంట్ ని ఎంకరేజ్ చేసే దర్శకుడు మారుతి. మారుతి చిత్రాల్లో గమనిస్తే హీరోతో సమానంగా ఉండే పాత్రలు ఉంటాయి. భలే భలే మగాడివోయ్ లో మురళి శర్మ, ప్రతిరోజూ పండగేలో రావు రమేష్, సత్యరాజ్ పాత్రలకు హీరో స్థాయి ప్రాధాన్యత ఉంటుంది.

ఇక విషయానికి వస్తే.. మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో 'ఏక్ మినీ కథ' ఫేమ్ సంతోష్ శోభన్ నటిస్తున్నాడు. ఈ చిత్రం మారుతి చిత్రాల బ్యాగ్రౌండ్ థీమ్ లో ఉండబోతోంది. భలే భలే మగాడివోయ్, మహానుభావుడు చిత్రాల తరహాలో ఓ వైవిధ్యమైన పాయింట్ తో ఈ చిత్రం ఉండబోతోందట.

ఈ చిత్రంలో హీరో పాత్రతో పాటు సమానమైన ప్రాధాన్యత ఉండే పాత్ర ఒకటి ఉందట. సాధారణంగా ఇలాంటి రోల్స్ కి నరేష్, రావు రమేష్, ప్రకాష్ రాజ్ లాంటి నటుల్ని ఎంపిక చేసుకుంటారు. కానీ మారుతి కొత్తదనం కోసం ఆసక్తికరమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

రంగస్థలం చిత్రంలో నెగటివ్ రోల్ లో అదరగొట్టిన అజయ్ ఘోష్ ని మారుతి ఎంపిక చేశారట. ఆ పాత్రకు అజయ్ ఘోష్ ఫిట్ అవుతాడని మారుతి నమ్మకం. ఈ చిత్రం కనుక క్లిక్ అయితే అజయ్ ఘోష్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అవుతుందని టాక్. యువి కాన్సెప్ట్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More News

స్టన్నింగ్ హాట్: పర్పుల్ డ్రెస్ లో మతిపోగొడుతున్న రష్మిక

సౌత్ లో రష్మిక మందన తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఛలో చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక..

'సోనీ లివ్' తెలుగు కంటెంట్ హెడ్ గా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత

కరోనా ప్రభావంతో ఓటిటి లకు డిమాండ్ బాగా పెరిగింది. థియేటర్స్ లేకపోవడంతో ఎంటర్టైన్మెంట్ కోసం సినీ అభిమానులు ఓటిటి లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వైరల్ పిక్స్: పూజా హెగ్డేతో ఫోటో.. సిగ్గు పడిపోతున్న కొరటాల శివ

పూజా హెగ్డేతో ఫోటో దిగేందుకు కొరటాల శివ సిగ్గు పడడం ఏంటి అనుకుంటున్నారా. అవును ఇది నిజం.

ఆంధ్ర, తెలంగాణ అనే భేదం లేదు.. జరిగిన తప్పుకు క్షమించండి: హైపర్ ఆది

బుల్లితెర హాస్య నటుడు హైపర్ ఆది తనపై వస్తున్న విమర్శలపై స్పందించాడు.

3 షోలతో అంటే కష్టం.. చైతు, సాయి పల్లవి 'లవ్ స్టోరీ'పై నిర్మాత!

అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం 'లవ్ స్టోరీ'. సెన్సిబుల్ చిత్రాలతో మ్యాజిక్ చేసే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో