రంగం రేంజ్ లో విజయం సాధించే రంగం-2 -'సోగ్గాడే చిన్ని నాయనా' ఫేం కళ్యాణ్ కృష్ణ
Saturday, October 15, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
జీవా-తులసీనాయర్ జంటగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి.కె.చంద్రన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం రంగం 2. జస్‌రాజ్ ప్రొడక్షన్స్ సమర్పణలో` శ్రీలక్ష్మిజ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఎ ఎన్.బాలాజి (సూపర్‌గుడ్ బాలాజి) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.హ్యారిస్ జైరాజ్ సంగీత సారధ్యంలో రూపొందిన రంగం-2` చిత్రం ఫస్ట్ లుక్ ను సోగ్గాడే చిన్ని నాయనా ఫేం కళ్యాణ్‌కృష్ణ విడుదల చేశారు. ఈ సందర్భంగా కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ...జీవా హీరోగా సినిమాటోగ్రాఫర్ టర్న్‌డ్ డైరెక్టర్ కె.వి.ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన రంగం ఎంతటి సంచలన విజయం సాధించిందో.. దర్శకుడిగా మారిన సినిమాటోగ్రాఫర్ రవి.కె.చంద్రన్ దర్శకత్వం వహించిన రంగం-2` చిత్రం కూడా అంతటి ఘన విజయం సాధించడం ఖాయం. రవి.కె.చంద్రన్- హ్యారిస్ జైరాజ్ వంటి టాప్ టెక్నీషియన్స్ వర్క్ చేసిన ఈ చిత్రం తమిళంలో మంచి విజయం సాధించింది. తెలుగులో రంగం-2` పేరుతో వస్తున్న ఈ చిత్రం ఇక్కడ కూడా ఘన విజయం సాధించాలని, నిర్మాతగా ఎ.ఎన్.బాలాజీకి (సూపర్‌గుడ్ బాలాజీ) మంచి పునాది కావాలని ఆకాంక్షిస్తున్నాను అన్నారు.
విడుదల చేసిన మూడు రోజుల్లోనే మూడున్నర లక్షల వ్యూస్ రావడం బట్టి రంగం-2` చిత్రానికి గల క్రేజ్ అర్ధమవుతుందని కె.వి.వి.వేణు అన్నారు.
రంగం-2` వంటి ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తుండడం ఎంతో గర్వంగా ఉందని నిర్మాత ఎ ఎన్.బాలాజీ (సూపర్ గుడ్ బాలాజీ) తెలిపారు.
నాజర్, జయప్రకాష్, ఊర్మిళ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, కెమెరా: మానుష్ నందన్, మాటలు: శశాంక్ వెన్నెలకంటి, పాటలు: వెన్నెలకంటి, సంగీతం: హ్యారిస్ జైరాజ్, సమర్పణ: జస్‌రాజ్ ప్రొడక్షన్స్, నిర్మాత: ఎ ఎన్.బాలాజీ, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: రవి.కె.చంద్రన్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments