'భేతాళుడు' విడుదల చేసిన 'రంగం 2' ట్రైలర్!

  • IndiaGlitz, [Sunday,November 06 2016]

పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొంది తెలుగు-తమిళ భాషల్లో సూపర్ హిట్ గా నిలిచిన "రంగం" హీరో జీవా కథానాయకుడిగా, నిన్నటితరం కథానాయకి రాధ చిన్న కుమార్తె తులసి నాయర్ హీరోయిన్ గా నటించిన తమిళ చిత్రం తెలుగులో "రంగం 2"గా త్వరలో విడుదలకానుంది. జస్‌రాజ్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో' శ్రీలక్ష్మిజ్యోతి క్రియేషన్స్‌ పతాకంపై ఎ.ఎన్‌.బాలాజీ (సూపర్‌గుడ్‌ బాలాజీ) నిర్మిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ను మ్యూజిక్ డైరెక్టర్ టర్నడ్ సక్సెస్ ఫుల్ హీరో కమ్ ప్రొడ్యూసర్ విజయ్ ఆంటోనీ విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత మల్కాపురం శివకుమార్, "ద్వారక" చిత్ర నిర్మాతలు ప్రధ్యుమ్న చంద్రపాటి-గణేష్ పెనుబోతు, దర్శకులు వి.సముద్ర పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ.. "జీవా నాకు మంచి స్నేహితుడు. విభిన్నమైన కథాంశాలను ఎంచుకోవడంలో ఎప్పుడూ ముందుంటాడు. అతడి మునుపటి చిత్రాల వలె "రంగం 2" కూడా మంచి విజయం సాధించాలని కోరుకొంటున్నాను" అన్నారు.

మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ.. "మా స్నేహితులు ఎ.ఎన్.బాలాజీ "రంగం 2" చిత్రంతో నిర్మాతగా మారినందుకు సంతోషంగా ఉంది. ఈ చిత్రం మంచి విజయం సాధించి ఆయనకు నిర్మాతగా మంచి పేరుతోపాటు డబ్బు కూడా తెచ్చిపెట్టాలని ఆశిస్తున్నాను" అన్నారు.

"రంగం 2" చిత్ర నిర్మాత ఎ.ఎఎన్.బాలాజీ మాట్లాడుతూ.. "జీవా కెరీర్ లో మైలురాయి లాంటి "రంగం" అనంతరం అదే స్థాయి ఆసక్తికరమైన కథతో తెరకెక్కిన "రంగం 2" చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. మా సినిమా పోస్టర్ ను ఇటీవల "సోగ్గాడే చిన్ని నాయన"

దర్శకులు కళ్యాణ్ కృష్ణ విడుదల చేయగా.. మా సినిమా ట్రైలర్ ను హీరో కమ్ ప్రొడ్యూసర్ విజయ్ ఆంటోనీగారు ఆవిష్కరించడం, పరిశ్రమ పెద్దలు మొదలుకొని ప్రతి ఒక్కరూ "రంగం 2"పై ఆసక్తి కనబరుస్తుండడం వంటి విషయాలు మాకు నూతనోత్తేజాన్నిస్తున్నాయి. త్వరలోనే ఆడియోను విడుదల చేసి, వీలైనంత తొందరలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం" అన్నారు.

"ద్వారక" చిత్ర నిర్మాతలు ప్రధ్యుమ్న చంద్రపాటి-గణేష్ పెనుబోతు చిత్ర బృందానికి తమ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ చిత్రంలో నాజర్‌, జయప్రకాష్‌, ఊర్మిళ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తుండగా.. ఈ చిత్రానికి ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, సంగీతం: హ్యారిస్‌ జైరాజ్‌, సమర్పణ: జస్‌రాజ్‌ ప్రొడక్షన్స్‌, నిర్మాత: ఎ.ఎన్‌.బాలాజీ (సూపర్‌గుడ్‌ బాలాజీ), కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: రవి.కె.చంద్రన్‌!!