నితిన్, కీర్తి సురేష్ ల 'రంగ్ దే' మార్చి 26న విడుదల

  • IndiaGlitz, [Friday,January 01 2021]

యూత్ స్టార్ 'నితిన్', 'కీర్తి సురేష్' ల తొలి కాంబినేషన్ లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ' సితార ఎంటర్ టైన్మెంట్స్' నిర్మిస్తున్న చిత్రం ఈ 'రంగ్ దే'. 'ప్రతిభగల యువ దర్శకుడు 'వెంకీ అట్లూరి' దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. పి.డి.వి.ప్రసాద్ చిత్ర సమర్పకులు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.

2021 ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుతూ...చిత్రం విడుదల తేదీని ప్రకటించారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ. దీనికి మ్యూజిక్ తో కూడిన ఓ వీడియో రూపకల్పన చేశారు. ఇందులో నితిన్, కీర్తిసురేష్ ల నృత్యాభినయం, సంగీతం వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. 2021 మార్చి 26 న ధియేటర్ ల లోనే చిత్రం విడుదల అవుతుందని తెలిపారు..సకుటుంబ సమేతంగా చూడతగ్గ చిత్రంగా దీనికి రూపకల్పన చేశారు దర్శకుడు 'వెంకీ అట్లూరి'.యూత్ స్టార్ నితిన్, నాయిక కీర్తి సురేష్ ల జంట వెండితెరపై కనువిందు చేయనుంది. ఇటీవల 'రంగ్ దే‘ చిత్రం నుంచి విడుదల అయిన దృశ్యాలతో కూడిన వీడియో, అలాగే ఓ గీతం బహుళ ప్రేక్షకాదరణ పొందిన విషయం విదితమే.

'ప్రేమ' తో కూడిన కుటుంబ కధా చిత్రం ఈ 'రంగ్ దే'. సుప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు పి.సి.శ్రీరామ్ గారు ఈ చిత్రానికి ఛాయాగ్రహణ దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

నితిన్,కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ఈ 'రంగ్ దే' చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, వినీత్,రోహిణి, కౌసల్య,బ్రహ్మాజీ,వెన్నెల కిషోర్, సత్యం రాజేష్,అభినవ్ గోమటం,సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి డి.ఓ.పి.: పి.సి.శ్రీరామ్; సంగీతం: దేవిశ్రీ ప్రసాద్; కూర్పు: నవీన్ నూలి, కళ: అవినాష్ కొల్లా, అడిషనల్ స్క్రీన్ ప్లే : సతీష్ చంద్ర పాశం.

More News

క్లైమాక్స్‌లో గోపీచంద్ 'సీటీమార్‌'

ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ‘సీటీమార్‌’.

'క్రాక్‌' ట్రైలర్‌.. పక్కా మాస్‌

మాస్‌ మహారాజా రవితేజ సినిమా ఉండాలని ఆయన అభిమానులు కోరుకుంటారో అలాంటి మాస్‌ అండ్‌ యాక్షన్‌ ఎలిమెంట్స్‌తో రూపొందిన చిత్రం 'క్రాక్‌'..

కరోనాతో వైసీపీ ఎమ్మెల్సీ మృతి

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారితో వైసీపీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి మృతి చెందారు. గత నెల 13న కరోనా చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు.

టీపీసీసీ చీఫ్ ఎవరో తేలకముందే.. కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్

పీసీసీ చీఫ్ ఎవరికి ఇవ్వాలనే దానిపై ఒకవైపు చర్చలు జరుగుతుండగానే.. కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరికపై నిర్ణయాన్ని ప్రకటించడం

కులాంతర వివాహం చేసుకున్నాడని.. వెంటాడి మరీ హతమార్చారు

పరువు హత్యలు ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోతున్నాయి. టెక్నాలజీ పరంగా రోజురోజుకూ అడుగులు ముందుకు పడుతుంటే.. కులం, మతం విషయంలో మాత్రం వెనక్కి పడుతున్నాయి.