‘రంగ్ దే’ తొలిరోజు వసూళ్లివే...
Send us your feedback to audioarticles@vaarta.com
నితిన్, కీర్తీ సురేశ్ జంటగా నటించిన చిత్రం ‘రంగ్ దే’. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకీ అట్లూరి ఈ సినిమాను రూపొందించారు. ఈ సంస్థలో నితిన్ చేసిన మూడవ చిత్రమిది. తొలి రెండు సినిమాలు ‘అ ఆ’, ‘భీష్మ’ మంచి సక్సెస్ సాధించాయి. తాజాగా ఈ చిత్రంతో నితిన్ హ్యాట్రిక్ సాధించాడనే చెప్పాలి. మానవ సంబంధాలు, విలువలు, భావోద్వేగాలను సినిమాలో అద్భుతంగా వెంకీ అట్లూరి చూపించగలిగారు. నితిన్, కీర్తి సురేష్‌ల మధ్య కెమెస్ట్రీ, సినిమాలో కామెడీ సీన్స్ బాగా వర్కవుట్ అయ్యాయి.
మొత్తానికి సినిమా అయితే తొలి షోతోనే సక్సెస్ టాక్‌ను సొంతం చేసుకుంది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మంచి వసూళ్లను రాబడుతోంది. ముఖ్యంగా మార్నింగ్ షోతో పోలిస్తే... మ్యాట్నీ, ఫస్ట్ షోకి వసూళ్లు పెరిగాయని చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. తొలిరోజు ఈ చిత్రం అద్భుతమైన వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఈ చిత్రం మొదటి రోజు 4.65 కోట్ల రూపాయల వసూళ్లను ఈ సినిమా రాబట్టింది. దీంతో చిత్ర యూనిట్ ఆనందంలో మునిగి తేలుతోంది.
ఏపీ, తెలంగాణలో తొలి రోజు వసూళ్లు ఈ విధంగా ఉన్నాయి.
ఏపీ + తెలంగాణ - రూ.4.65 కోట్లు
నిజాం - రూ. 1.54 కోట్లు
ఈస్ట్ - రూ. 52 లక్షలు
వెస్ట్ - రూ. 31 లక్షలు
కృష్ణా - రూ.24 లక్షలు
వైజాగ్ - రూ.56 లక్షలు
గుంటూరు - రూ.67 లక్షలు
సీడెడ్ - రూ.60 లక్షలు
టోటల్ - 4.65 కోట్లు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments