‘రంగ్ దే’ తొలిరోజు వసూళ్లివే...

  • IndiaGlitz, [Saturday,March 27 2021]

నితిన్‌, కీర్తీ సురేశ్‌ జంటగా నటించిన చిత్రం ‘రంగ్‌ దే’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై వెంకీ అట్లూరి ఈ సినిమాను రూపొందించారు. ఈ సంస్థలో నితిన్ చేసిన మూడవ చిత్రమిది. తొలి రెండు సినిమాలు ‘అ ఆ’, ‘భీష్మ’ మంచి సక్సెస్ సాధించాయి. తాజాగా ఈ చిత్రంతో నితిన్‌ హ్యాట్రిక్ సాధించాడనే చెప్పాలి. మానవ సంబంధాలు, విలువలు, భావోద్వేగాలను సినిమాలో అద్భుతంగా వెంకీ అట్లూరి చూపించగలిగారు. నితిన్, కీర్తి సురేష్‌ల మధ్య కెమెస్ట్రీ, సినిమాలో కామెడీ సీన్స్ బాగా వర్కవుట్ అయ్యాయి.

మొత్తానికి సినిమా అయితే తొలి షోతోనే సక్సెస్ టాక్‌ను సొంతం చేసుకుంది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మంచి వసూళ్లను రాబడుతోంది. ముఖ్యంగా మార్నింగ్‌ షోతో పోలిస్తే... మ్యాట్నీ, ఫస్ట్‌ షోకి వసూళ్లు పెరిగాయని చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. తొలిరోజు ఈ చిత్రం అద్భుతమైన వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఈ చిత్రం మొదటి రోజు 4.65 కోట్ల రూపాయల వసూళ్లను ఈ సినిమా రాబట్టింది. దీంతో చిత్ర యూనిట్ ఆనందంలో మునిగి తేలుతోంది.

ఏపీ, తెలంగాణలో తొలి రోజు వసూళ్లు ఈ విధంగా ఉన్నాయి.

ఏపీ + తెలంగాణ - రూ.4.65 కోట్లు
నిజాం - రూ. 1.54 కోట్లు
ఈస్ట్ - రూ. 52 లక్షలు
వెస్ట్ - రూ. 31 లక్షలు
కృష్ణా - రూ.24 లక్షలు
వైజాగ్ - రూ.56 లక్షలు
గుంటూరు - రూ.67 లక్షలు
సీడెడ్ - రూ.60 లక్షలు
టోటల్ - 4.65 కోట్లు

More News

'రంగ్ దే'ను ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కులంద‌రికీ థాంక్స్‌.. ఈ బ్యాన‌ర్‌లో హ్యాట్రిక్ రావ‌డం హ్యాపీ - నితిన్‌

నితిన్‌, కీర్తి సురేష్ జంట‌గా వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం 'రంగ్ దే'.

చిత్తూరులో స్కూల్‌నే బార్‌గా మార్చేసిన ‘నీచర్’!

ఆ ఉపాధ్యాయుడి పేరు కోటేశ్వరరావు అలియాస్ శ్రీధర్. పాకాల మండలం కృష్ణాపురం మండల పరిషత్‌ ప్రాథమిక ఏకోపాధ్యాయ పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్నాడు.

అభిమానుల సాక్షిగా సర్‌ప్రైజ్‌ను రివీల్ చేసిన రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు రేపు(శనివారం). ఈ సందర్భంగా ఆయన ఒక పెద్ద సర్‌ప్రైజ్‌ను ముందే రివీల్ చేసేశాడు.

అసెంబ్లీ వేదికగా లాక్‌డౌన్‌పై కేసీఆర్ క్లారిటీ..

తెలంగాణలో లాక్‌డౌన్‌పై అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టత ఇచ్చారు.

కేసీఆర్ సర్కారుపై కన్నెర్రజేసిన కాగ్...

2019 సంవత్సరానికి గానూ ప్రభుత్వరంగ సంస్థలపై కాగ్ తన నివేదికను విడుదల చేసింది. కేసీఆర్ సర్కారుపై కన్నెర్రజేసిన కాగ్..