'రంగ్ దే' నాల్గవ రోజు వసూళ్లివే..

  • IndiaGlitz, [Tuesday,March 30 2021]

నితిన్‌, కీర్తీ సురేశ్‌ జంటగా నటించిన చిత్రం ‘రంగ్‌ దే’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై వెంకీ అట్లూరి ఈ సినిమాను రూపొందించారు. ఈ సంస్థలో నితిన్ చేసిన మూడవ చిత్రమిది. తొలి రెండు సినిమాలు ‘అ ఆ’, ‘భీష్మ’ మంచి సక్సెస్ సాధించాయి. తాజాగా ఈ చిత్రంతో నితిన్‌, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ హ్యాట్రిక్ సాధించాయనే చెప్పాలి. మానవ సంబంధాలు, విలువలు, భావోద్వేగాలను సినిమాలో అద్భుతంగా వెంకీ అట్లూరి చూపించగలిగారు. నితిన్, కీర్తి సురేష్‌ల మధ్య కెమెస్ట్రీ, సినిమాలో కామెడీ సీన్స్ బాగా వర్కవుట్ అయ్యాయి.

మొత్తానికి సినిమా అయితే తొలి షోతోనే సక్సెస్ టాక్‌ను సొంతం చేసుకుంది. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రం తొలి రోజు నుంచి వసూళ్ల పరంపరను కొనసాగిస్తూనే ఉంది. ‘రంగ్ దే’ సినిమా నాలుగవ రోజు సైతం మంచి వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో నాలుగవ రోజు 12.46 కోట్ల రూపాయల వసూళ్లను ఈ సినిమా రాబట్టింది. ఏపీ, తెలంగాణలో ఈ చిత్రం ఇప్పటికే రూ.18 కోట్ల బిజినెస్‌ను చేసింది. అంటే చిత్రానికి అయిన ఖర్చులో 70 శాతాన్ని కేవలం 4 రోజుల్లోనే రాబట్టుకుంది. ఇక యూఎస్, ఆస్ట్రేలియాలో అయితే ఈ చిత్రం ప్రాఫిట్ జోన్‌లోనే ఉంది. దీంతో చిత్ర యూనిట్ ఆనందంలో మునిగి తేలుతోంది.

ఏపీ, తెలంగాణలో నాల్గవ రోజు వసూళ్లు..

నిజాం - రూ. 4.69 కోట్లు
ఈస్ట్ - రూ. 98.8 లక్షలు
వెస్ట్ - రూ. 70 లక్షలు
కృష్ణా - రూ.60 లక్షలు
వైజాగ్ - రూ.1.58 కోట్లు
గుంటూరు - రూ.1.30 కోట్లు
నెల్లూరు - రూ.50.18 లక్షలు
సీడెడ్ - రూ.2.1 కోట్లు
టోటల్ - రూ.12.46 కోట్లు

More News

నితిన్ `మాస్ట్రో`.. రిలీజ్ డేట్ ఫిక్స్‌

ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన భీష్మతో సూపర్‌ హిట్‌ కొట్టిన నితిన్ అంతకు ముందు దాదాపు ఏడాదికి పైగానే గ్యాప్‌ తీసుకున్న సంగతి తెలిసిందే.

విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో చిరంజీవి.. టైటిల్ ఖ‌రారు

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా డైరెక్ట‌ర్ బాబీ ఓ సినిమాను తెర‌కెక్కించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

ఎన్టీఆర్ 30లో ప్ర‌భాస్ విల‌న్‌...?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ చిత్రంలో ప్ర‌తినాయ‌కుడిగా ప్ర‌భాస్ సినిమాలో న‌టిస్తోన్న విల‌న్ క‌నిపించ‌బోతున్నాడా?

‘బీబీ 3’..లో బాల‌య్య‌ను ఢీ కొట్ట‌నున్న కోలీవుడ్ స్టార్‌..!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో మూడో చిత్రం రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే.

‘వకీల్‌సాబ్’ ట్రైలర్: పవన్ ఎంట్రీయే దుమ్ములేచిపోయింది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మూడేళ్ల గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా ‘వకీల్ సాబ్’. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌‌ను కంప్లీట్ చేస్తోంది.