Ranbir Rashmika:'అమ్మాయి' పాటలో లిప్‌లాక్స్‌తో రెచ్చిపోయిన రణ్‌బీర్-రష్మిక
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్‌బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన 'యానిమల్-ది మోస్ట్ వైలెంట్' చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. తెలుగులో 'అమ్మాయి' అంటూ సాగే ఈ పాటలో రణ్‌బీర్-రష్మిక లిప్‌లాక్స్‌తో రెచ్చిపోయారు. ఈ పాటను రాఘవ్ పాడగా.. అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించారు. ఈ పాట చూస్తుంటే మరో 'అర్జున్ రెడ్డి' లాగా సినిమా తీసి ఉంటారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దర్శకుడు సందీప్ రెడ్డి అర్జున్ రెడ్డి యాటిట్యూడ్ నుంచి ఇంకా బయటకు రాలేదని చెబుతున్నారు.
రణ్‌బీర్ తండ్రిగా అనిల్ కపూర్.. విలన్‌గా బాబీ డియోల్..
ఇక ఇటీవల విడుదల చేసిన టీజర్లో సినిమా ఎలా ఉండబోతుందో చూపించేశాడు. తన మార్క్ యాటిట్యూడ్‌తో పాటు యాక్షన్ సీక్వెన్స్‌తో అలరించాడు. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ అనీల్ కపూర్.. రణ్‌బీర్ తండ్రిగా కనినిపించనున్నాడు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నాడు. మనన్ భరద్వాజ్ ఈ సినిమాకు స్వరాలు అందిస్తున్నాడు. భద్రకాళి పిక్చర్స్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ముందుగా ఆగస్టు 11న సినిమాను విడుదల చేయాలని భావించినా.. వీఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో డిసెంబర్ 1కు వాయిదా వేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments