'యానిమల్' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

  • IndiaGlitz, [Thursday,January 25 2024]

తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన 'యానిమల్' చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపిన సంగతి తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ 1న రిలీజ్ అయిన ఈ సినిమా రూ.900 కోట్లకు పైగా వసూలు చేసి రణ్‌బీర్ కెరీర్‌లోనే ఆల్ టైమ్ హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. అయితే కొంతమంది సినిమా సూపర్‌గా ఉందంటూ మెచ్చుకుంటుంటే.. మరికొంతమంది మాత్రం సినిమాలో వయెలెన్స్, రొమాన్స్ మోతాదుకు మించి ఉందని తీవ్ర విమర్శలు చేశారు. అయినా కానీ సినిమా బ్లాక్‌బాస్టర్‌గా నిలిచింది.

తండ్రి సెంటిమెంట్‌ను సందీప్.. తనదైన స్టైల్‌లో సరికొత్తగా ప్రెజెంట్ చేసిన విధానం యువతను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో రష్మిక మందన్న, తృప్తి దిమ్రీ హీరోయిన్స్‌గా నటించగా అనిల్ కపూర్, బాబీ డియోల్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. సినిమా విడుదలై దాదాపు రెండు నెలలు కావొస్తున్నా ఇంతవరకు ఓటీటీలో రిలీజ్ కాలేదు. ఓటీటీలో మరో 8 నిమిషాల అదనపు సీన్స్‌తో స్ట్రీమ్ కాబోతుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. దీంతో ఆ సీన్‌లు ఎలా ఉంటాయనే ఆసక్తి నెలకొంది. ఎట్టకేలకు అభిమానులకు శుభవార్త అందింది.

తాజాగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌ స్ట్రీమింగ్ డేట్‌ అనౌన్స్ చేసింది. ఈ మూవీని రిపబ్లిక్‌ డే సందర్భంగా జనవరి 26న తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, భాషల్లో రిలీజ్ చేయబోతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. అంటే ఈరోజు అర్ధరాత్రి 12 గంటల నుంచే స్ట్రీమింగ్ కానుంది. మరి ఇంకెందుకు ఆలస్యం థియేటర్లో సినిమా మిస్ అయిన వారు, మళ్లీ చూడాలనుకునే వారు అర్థరాత్రి నుంచి చూసేయండి.

ఇక సందీప్ రెడ్డి తదుపరి సినిమాల విషయానికొస్తే రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా 'స్పిరిట్' చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ మూవీలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్‌ ఆఫీసర్‌గా నటించనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి కావడంతో త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టనుంది. భారీ బడ్జెట్‌తో దీనిని నిర్మించనున్నారు. దీంతో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ఓ చిత్రానికి కమిట్ అయ్యాడు. ప్రభాస్ సినిమా షూటింగ్ పూర్తి కాగానే ఈ మూవీని డైరెక్ట్ చేయనున్నాడు. మొత్తానికి వరుస సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ మీద దండయాత్ర చేసేందుకు సిద్ధమయ్యాడు.

 
 

More News

HMDA అవినీతి అనకొండ అరెస్ట్.. రూ.100కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు

హైదరాబాద్‌లో భారీ అవినీతి కొండ ఏసీబీ అధికారులకు దొరికింది. ఆ అనకొండ అక్రమంగా కూడబెట్టిన ఆస్తులు చూసి అధికారులే నివ్వెరపోయారు. హైదరాబాద్ మున్సిపల్ డెవలప్మెంట్ పట్టణ ప్రణాళిక

కౌశిక్‌రెడ్డి ఎన్నికల ప్రచారంపై గవర్నర్ సీరియస్.. చర్యలకు ఈసీకి ఆదేశం..

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డిపై(Padi Kaushikreddy) ఎన్నికల ప్రచారంపై గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్(Tamilisai) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో

గోల్కొండ కోటతో నాకు ఉన్న అనుబంధం అమోఘం: చిరంజీవి

ప్రపంచ దేశాలు భారతదేశ చలనచిత్రం వైపు చూస్తోందని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. విజయేంద్రప్రసాద్,రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో సినిమాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు.

జనసేనకు శుభవార్త.. గాజు గ్లాసు గుర్తును ఖరారుచేసిన సీఈసీ..

ఎన్నికల సమయంలో జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం శుభవార్త అందించింది. గాజు గ్లాసు గుర్తును పార్టీకి ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జనసేన కేంద్ర కార్యాలయం మెయిల్‌కు

తన కుటుంబాన్ని చీల్చి కాంగ్రెస్ రాజకీయం చేస్తోంది: సీఎం జగన్

ఏపీ కాంగ్రెస్ పార్టీకి వైయస్ షర్మిల అధ్యక్షురాలు కావడంపై సీఎం జగన్ తొలిసారి బహిరంగంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ చెత్త రాజకీయం చేస్తోందని తన కుటుంబాన్ని చీల్చి రాజకీయం చేస్తోందని మండిపడ్డారు.