రణభీర్, అలియా కిస్సింగ్ వీడియో...
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ స్టార్స్ రణభీర్ కపూర్, అలియా భట్ ప్రేమ పక్షులుగా విహరిస్తున్నారు. వీలున్నప్పుడల్లా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఈ ఏడాది వీరి పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వినపడుతున్నాయి. అయితే ఇరువురి కుటుంబాల నుండి ఎలాంటి సమాచారం మాత్రం లేదు. అయితే ఇద్దరి సానిహిత్యం బాహటమవుతూనే ఉంది. రీసెంట్గా ఓ జీటీవీ అవార్డ్స్ వేదికలో మరోసారి ఈ సానిహిత్యం బయటపడింది.
రాజి సినిమాకు ఉత్తమనటిగా అలియా భట్.. సంజు సినిమాకు రణభీర్ కపూర్ ఉత్తమనటుడిగా అవార్డును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఫంక్షన్లో ఆలియా పేరుని అనౌన్స్ చేయగానే.. రణభీర్, అలియా ముద్దు పెట్టుకోవాలనుకున్నారు. అది లిప్ లాక్ అవుతుందనుకుంటే.. ఇద్దరూ నవ్వుకుని చెంపలపై ముద్దు పెట్టుకున్నారు. ఈ కిస్సింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments