Animal:బాక్సాఫీస్‌పై రణ్‌బీర్ వైల్డ్‌నెస్.. దుమ్మురేపిన 'యానిమల్' కలెక్షన్స్..
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, దర్శకడు సందీప్ రెడ్డి వంగా కాంబో వచ్చిన 'యానిమల్' మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకొని బ్లాక్‌బస్టర్ వైల్డ్ హిట్ కొట్టింది. దీంతో ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబడుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే అదరగొట్టిన ఈ చిత్రం తొలిరోజు వసూళ్లు రూ.100కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా రూ.116 కోట్లు వసూళ్లు రాబట్టినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. కేవలం ఇండియాలోనే దాదాపు రూ.70 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్టుగా తెలుస్తోంది.
హిందీలో రూ.50 కోట్లు, తెలుగులో రూ.10 కోట్లు, కన్నడ, తమిళ్, మలయాళం కలిపి రూ.10కోట్లు కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం. ఇక ఓవర్సీస్‌లో రూ.50 కోట్ల వరకు కలెక్ట్ చేయడం విశేషం. షారుఖ్ ఖాన్ 'పఠాన్' ఇండియాలో మొదటి రోజు రూ.57 కోట్లు, సల్మాన్ ఖాన్ 'టైగర్ 3' రూ.44 కోట్లు కలెక్ట్ చేశాయి. దీంతో ఖాన్‌ల సినిమాలను రణ్‌బీర్ బ్రేక్ చేసి సంచలనం సృష్టించాడు. అయితే సెలవు దినం కాని గురువారం రోజే ఈ రేంజ్ వసూళ్లు వస్తే.. ఇక వీకెండ్‌లో ఇంకెంత వసూళ్లు వస్తాయో అని ఆశ్చర్యపోతున్నారు. మరే పెద్ద సినిమా పోటీకి లేకపోవడం, సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో శుక్ర, శని, ఆదివారాల్లో భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశాలున్నాయి. రూ.200కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీని తెరకెక్కించిన నిర్మాతలకు భారీ లాభాలు రానున్నాయి.
తండ్రికొడుకుల మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు, వైల్డ్ యాక్షన్ ఫైట్స్, రణబీర్ యాక్టింగ్, రష్మిక అందాలు, బాబీ డియోల్ విలనిజం ఇలా రకాలుగా ప్రేక్షకులని ఆకట్టుకుంది మూవీ. అయితే ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉందనే టాక్ వచ్చింది. కానీ ఓవరాల్‌గా సినిమా మాత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా సందీర్ రెడ్డి డైరెక్షన్, రణ్‌బీర్ యాక్టింగ్ అభిమానులను కట్టిపడేసింది. చివర్లో ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందనే చెప్పే సన్నివేశాలు కూడా ఆకట్టుకున్నాయి. మొత్తానికి థియేటర్లోకి వెళ్లిన ప్రేక్షకులను సందీప్ రెడ్డి తన వైల్డ్ ప్రపంచంలోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com