Ramayanam:'రామాయణం' మూవీ నుంచి రణ్‌బీర్, సాయిపల్లవి స్టిల్స్ లీక్
Send us your feedback to audioarticles@vaarta.com
'యానిమల్' సినిమాలో వైల్డ్ పాత్రలో నటించిన మెప్పించిన బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్(RanbirKapoor) ఇప్పుడు దేవుడి పాత్రలోకి మారిపోయాడు. దంగల్ దర్శకుడు నితేశ్ తివారీ దర్శకత్వంలో 'రామాయణం' తెరకెక్కబోతుంది అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో రణబీర్ రాముడిగా, సాయి పల్లవి(Sai Pallavi) సీతగా, యశ్ రావణాసురుడిగా నటిస్తున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా ఎలాంటి హడావిడి లేకుండానే ఈ మూవీ షూటింగ్ సైలెంట్‌గా స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం మూవీ షూటింగ్ సెట్ నుంచి రణబీర్, సాయి పల్లవి ఫోటోలు లీక్ అయ్యాయి. ఈ ఫొటోలు చూసి అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. రాముడిగా రణ్‌బీర్ బాగా సూట్ అయ్యాడని, సీతమ్మగా సాయిపల్లవి చక్కగా కుదిరిందని కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమాపై ఒక్కసారిగా భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ మూవీకి ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్, హాలీవుడ్ ఆస్కార్ విన్నర్ హన్స్ జిమ్మెర్ కలిసి సంగీతం అందించనున్నారని సమాచారం. ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో ఈ సినిమా గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ఇప్పటికే 'రామాయణం' మీద భారతీయ సినీ చరిత్రలో ఎన్నో సినిమాలు ఇచ్చాయి. గతేడాది రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ విడుదలైన విషయం విధితమే. అయితే ఈ సినిమా అనేక విమర్శలు ఎదుర్కొంది. మూవీలో ప్రభాస్ రాముడి లుక్ సెట్ కాలేదని.. సీతమ్మ పాత్రను అసభ్యంగా చూపించారని.. యానిమేషన్ సినిమాను తీశారంటూ ఘోరమైన ట్రోల్స్ వచ్చాయి. దీంతో రణ్‌బీర్‌తో తీస్తున్న రామాయణం సినిమాను మేకర్స్ చాలా జాగ్రత్తగా ఆచితూచి తీస్తున్నారట. తాజాగా విడుదలైన మూవీ స్టిల్స్ చూస్తుంటే ఈ విషయం అర్థవుతోంది.
కాగా రణ్‌బీర్ కపూర్ హీరోగా తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటించిన 'యానిమల్' చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. గత ఏడాది డిసెంబర్ 1న రిలీజ్ అయిన ఈ సినిమా రూ.900 కోట్లకు పైగా వసూలు చేసి రణ్‌బీర్ కెరీర్‌లోనే ఆల్ టైమ్ హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. అయితే కొంతమంది సినిమా సూపర్‌గా ఉందంటూ మెచ్చుకుంటుంటే.. మరికొంతమంది మాత్రం సినిమాలో వయెలెన్స్, రొమాన్స్ మోతాదుకు మించి ఉందని తీవ్ర విమర్శలు చేశారు. అయినా కానీ సినిమా బ్లాక్‌బాస్టర్‌గా నిలిచింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments