డబ్బింగ్ పూర్తి చేసుకున్న'రణరంగం'
Send us your feedback to audioarticles@vaarta.com
AR మూవీ ప్యారడైజ్ పతాకంపై కిషోర్ కుమార్, యగ్నాశెట్టి హీరోహీరోయిన్లుగా శరణ్. కె. అద్వైతన్ దర్శకత్వంలో ఏ. రామమూర్తి నిర్మించిన చిత్రం 'రణరంగం'. తమిళ్లో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. "ఈ చిత్రం తమిళంలో ఘనవిజయం సాధించింది. త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం. తెలుగులో కూడా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. మూడు దశాబ్ధాల కథతో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కింది. దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు అందరికీ నచ్చుతుంది. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని అందించారు. ఆయన మ్యూజిక్ ఈ చిత్రానికి ప్రధాన ఎస్సెట్. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాము.." అని అన్నారు.
కిషోర్ కుమార్, యగ్నాశెట్టి, సులీలే కుమార్, మిధున్ కుమార్, రజినీ మహదేవయ్య, అజయ్ రత్నం, ధీరజ్ రత్నం తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, ఎడిటింగ్: సురేష్ యుఆర్ఎస్, ప్రొడక్షన్ డిజైనర్: ఏఆర్. శీనురాజ్, కెమెరా: పుష్పరాజ్ సంతోష్, జెమిన్ జామ్ అయ్యనేత్, నిర్మాత: ఏ. రామమూర్తి, దర్శకత్వం: శరణ్. కె. అద్వైతన్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments