డబ్బింగ్ పూర్తి చేసుకున్న'రణరంగం'

  • IndiaGlitz, [Thursday,November 15 2018]

AR మూవీ ప్యారడైజ్ పతాకంపై కిషోర్ కుమార్, యగ్నాశెట్టి హీరోహీరోయిన్లుగా శరణ్. కె. అద్వైతన్ దర్శకత్వంలో ఏ. రామమూర్తి నిర్మించిన చిత్రం 'రణరంగం'. తమిళ్‌లో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ఈ చిత్రం తమిళంలో ఘనవిజయం సాధించింది. త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం. తెలుగులో కూడా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. మూడు దశాబ్ధాల కథతో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కింది. దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు అందరికీ నచ్చుతుంది. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని అందించారు. ఆయన మ్యూజిక్ ఈ చిత్రానికి ప్రధాన ఎస్సెట్. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాము.. అని అన్నారు.

కిషోర్ కుమార్, యగ్నాశెట్టి, సులీలే కుమార్, మిధున్ కుమార్, రజినీ మహదేవయ్య, అజయ్ రత్నం, ధీరజ్ రత్నం తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, ఎడిటింగ్: సురేష్ యుఆర్‌ఎస్, ప్రొడక్షన్ డిజైనర్: ఏఆర్. శీనురాజ్, కెమెరా: పుష్పరాజ్ సంతోష్, జెమిన్ జామ్ అయ్యనేత్, నిర్మాత: ఏ. రామమూర్తి, దర్శకత్వం: శరణ్. కె. అద్వైతన్.

More News

తెరాస, మహాకూటమి లకు ఓటమి తప్పదు: పరిపూర్ణనంద స్వామి

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్ రావు 5 వేల.మందితో ఏర్పాటు చేసిన భారీ ర్యాలీ పాల్గొన్నారు.

'అమృత వ‌ర్షిణి' షూటింగ్ ప్రారంభం

నంద‌మూరి తార‌క‌ర‌త్న‌, మేఘ శ్రీ జంట‌గా చాందిని క్రియేష‌న్స్ ప‌తాకంపై  శివ‌ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌రాజు నెక్కంటి తెలుగు,క‌న్న‌డ భాష‌ల్లో   నిర్మిస్తున్న  చిత్రం 'అమృత వ‌ర్షిణి'.

జ్యోతికకు విద్యాబాల‌న్ అభినంద‌న‌

పెళ్లి త‌ర్వాత కాస్త గ్యాప్ తీసుకుని '36 వ‌య‌దినిలే, మ‌గ‌లిర్ మ‌ట్రుమ్‌, నాచియార్' చిత్రాల్లో న‌టించిన జ్యోతిక హిందీలో విద్యాబాల‌న్ న‌టించిన 'తుమ్హారీ సులు'

అజిత్ సినిమా విష‌యంలో మ‌ళ్లీ రూమర్స్‌

'వీరం, వేదాళం, వివేకం' సినిమాల త‌ర్వాత అజిత్‌, శివ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న‌ నాలుగో సినిమాగా 'విశ్వాసం'.

మీ టూ పై ర‌వితేజ స్పంద‌న‌...

స్త్రీల‌పై జ‌రుగుతున్న లైంగిక వేధింపులు గురించి ప‌లువురు ప‌లు ర‌కాలుగా తమ స్పంద‌న‌న‌ను తెలియ‌జేస్తున్నారు. కొంద‌రు పాజిటివ్‌గా త‌మ స్పంద‌న‌ను తెలియ‌జేస్తే..