సంక్రాంతి విషెస్ చెబుతూ.. రానా ‘విరాటపర్వం’ పోస్టర్ విడుదల..
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి ‘బాహుబలి’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుసంపాదించుకున్నాడు. ప్రస్తుతం మరో అద్భుతమైన టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అదే.. ‘విరాటపర్వం’. ‘రివల్యూషన్ ఈజ్ ఏన్ యాక్ట్ ఆఫ్ లవ్’ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ సినిమా తెరెక్కుతోంది. ఈ సినిమాలో రానా.. నక్సలైట్ పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా విషెస్ చెబుతూ.. రానా, సాయిపల్లవిలకు సంబంధించిన పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. సాయి పల్లవి రానా చేయి పట్టుకుని.. ఇద్దరూ నవ్వుకుంటూ వస్తున్నట్టుగా పోస్టర్‌ను డిజైన్ చేశారు.
ఇటీవల రానా బర్త్‌డే సందర్భంగా ‘విరాటపర్వం’ ఫస్ట్ లుక్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఫస్ట్‌లుక్‌ను చూసిన మీదటే ఈ సినిమాలో రానా క్యారెక్టర్‌పై ఓ క్లారిటీ వచ్చింది. వేణు ఊడుగుల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సామాజిక కథాంశానికి వాణిజ్య హంగుల్ని మేళవిస్తూ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ మూవీలో నివేదా పెతురాజ్, ప్రియమణి, నందితాదాస్, నవీన్‌చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీరావు, బెనర్జీ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. సురేష్ బొబ్బిలి స్వరాలు సమకూరుస్తున్నారు. ఎస్.ఎల్.వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ‘విరాటపర్వం’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com