అఖిల్‌తో రానా రెండు చిత్రాలు
Send us your feedback to audioarticles@vaarta.com
"ఎంత ప్రతిభ వున్నా ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలన్నది నానుడి". అది అక్కినేని అఖిల్ కు సరిగ్గా సరిపోతుంది. ఫస్ట్ మూవీని వి.వి.వినాయక్ దర్శకత్వంలో 'అఖిల్'గా చేసినా, రెండో చిత్రం బ్రిలియంట్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ డైరెక్షన్‌లో 'హలో'గా చేసినా అఖిల్‌కు మాత్రం విజయాన్ని అందివ్వలేకపోయాయి.
ఇక తన మూడో సినిమా గురించి జనవరి 10న ప్రకటించబోతున్నానని 'హలో' ప్రమోషన్లలోనే అఖిల్ చెప్పినా.. అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. అయితే ఆ మధ్య మీడియాలో అఖిల్ మూడో సినిమా డైరెక్షన్ కు సంబంధించి సుకుమార్, సత్య పినిశెట్టి, 'మెర్సల్' డైరెక్టర్ అట్లి లాంటి దర్శకుల పేర్లు వినిపించాయి.
అలాగే రాంగోపాల్ వర్మ కూడా అఖిల్ మూవీ కోసం.. ఒక దర్శకుడిని నాగార్జునకి పరిచయం చేసినట్టు కూడా వార్తలు వచ్చాయి. కాని ఇంతవరకు ఎవరి పేరుని ధ్రువీకరించలేదు అక్కినేని అండ్ కో. ఇదిలా వుంటే...ఒక పెద్ద దర్శకుడితోనే అఖిల్ తదుపరి సినిమా ఉండబోతోందని తాజా సమాచారం.
ఈ సినిమాతో పాటు అఖిల్ నటిస్తున్న మరో చిత్రాన్ని కూడా దగ్గుబాటి రానా నిర్మించనున్నారని పరిశ్రమలో వినబడుతున్న మాట. త్వరలోనే రానా నిర్మించే ఈ చిత్రాలకి సంబంధించిన అధికారిక సమాచారం వెలువడుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com