అఖిల్‌తో రానా రెండు చిత్రాలు

  • IndiaGlitz, [Saturday,February 10 2018]

"ఎంత ప్రతిభ వున్నా ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలన్నది నానుడి". అది అక్కినేని అఖిల్ కు సరిగ్గా సరిపోతుంది. ఫస్ట్ మూవీని వి.వి.వినాయక్ దర్శకత్వంలో 'అఖిల్'గా చేసినా, రెండో చిత్రం బ్రిలియంట్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ డైరెక్షన్‌లో 'హలో'గా చేసినా అఖిల్‌కు మాత్రం విజయాన్ని అందివ్వలేకపోయాయి.

ఇక తన మూడో సినిమా గురించి జనవరి 10న ప్రకటించబోతున్నానని 'హలో' ప్రమోషన్లలోనే అఖిల్ చెప్పినా.. అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. అయితే ఆ మధ్య మీడియాలో అఖిల్ మూడో సినిమా డైరెక్షన్ కు సంబంధించి సుకుమార్, సత్య పినిశెట్టి, 'మెర్సల్' డైరెక్టర్ అట్లి లాంటి దర్శకుల పేర్లు వినిపించాయి.

అలాగే రాంగోపాల్ వర్మ కూడా అఖిల్ మూవీ కోసం.. ఒక దర్శకుడిని నాగార్జునకి పరిచయం చేసినట్టు కూడా వార్తలు వచ్చాయి. కాని ఇంతవరకు ఎవరి పేరుని ధ్రువీకరించలేదు అక్కినేని అండ్ కో. ఇదిలా వుంటే...ఒక పెద్ద దర్శకుడితోనే అఖిల్ త‌దుప‌రి సినిమా ఉండబోతోందని తాజా సమాచారం.

ఈ సినిమాతో పాటు అఖిల్ నటిస్తున్న మరో చిత్రాన్ని కూడా దగ్గుబాటి రానా నిర్మించనున్నారని పరిశ్రమలో వినబడుతున్న మాట. త్వ‌ర‌లోనే రానా నిర్మించే ఈ చిత్రాల‌కి సంబంధించిన అధికారిక స‌మాచారం వెలువ‌డుతుంది.

More News

'మెహబూబా' టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆకాష్ పూరి హీరోగా లావణ్య సమర్పణలో

'రౌడీ పోలీస్' గా నికిషా పటేల్

పవన్ కళ్యాణ్ పులి సినిమాతో పరిచయమైన బ్యూటీ నిఖిషాపటేల్. అలరించే అందం.. ఆకట్టుకునే అభినయం నిఖిషా సొంతం. అయితే కెరీర్ అనుకున్నంత వేగంగా సాగలేదు. మధ్యలో కొన్ని సినిమాల్లో అలరించిన నిఖిషా ఇప్పుడు ఓ లేడీ ఓరియంటెడ్ మూవీతో రాబోతోంది. ఈ సినిమాలో నిఖిషా పోలీస్ ఆఫీసర్ గా పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తుంది. అందుకు తగ్గట్టుగానే సినిమా టైటిల్ 

ఫిబ్రవరి 13న 'రంగస్థలం' తొలి పాట

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతున్న భారీ చిత్రం 'రంగస్థలం'.

హృదయం వున్న ప్రతి ఒక్కరికీ నచ్చే చిత్రం 'మనసుకు నచ్చింది' - మంజుల ఘట్టమనేని

యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా అమైరా దస్తూర్,త్రిదా చౌదరి హీరోయిన్ గా మంజుల ఘట్టమనేని దర్శకత్వంలో

'శీనుగాడి ప్రేమ ' ఆడియో లాంచ్!!

సుష్మ ఎంటర్ టైన్ మెంట్ మీడియా పతాకంపై శ్రీనివాసరావు హీరోగా నటిస్తూ నిర్మిస్తోన్న చిత్రం 'శీనుగాడి ప్రేమ'.