స్టేజ్ పై రానా పాదాభివందనం.. పరుగులు తీసిన సుమ!
Send us your feedback to audioarticles@vaarta.com
నేచురల్ స్టార్ నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన చిత్రం ‘జెర్సీ’. పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 19న సినిమా విడుదలైంది. సినిమా సక్సెస్ సాధించిన సందర్భంగా ఆదివారం సాయంత్రం చిత్రబృందం థాంక్స్ మీట్ ఏర్పాటు చేసింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దగ్గుబాటి రానా విచ్చేశారు. కార్యక్రమంలో భాగంగా రానా మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకానొక సందర్భంలో యాంకర్ సుమను స్టేజ్ మొత్తం పరిగెత్తిస్తూ.. ఆమెకు పాదాభివందనం చేయగా సుమ కంగారుపడిపోయింది. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
నాకు అమ్మాయిలు అర్థం కారు!
"నాకు లైఫ్‌లో బేసిక్‌గా కొన్ని అర్థం కావు. క్రికెట్, పెళ్లి, అమ్మాయిలు, పిల్లలు అసలు అర్థం కారు. ఇవన్నీ అర్థం కానీ నాకే ఈ సినిమా చూసి ఏడుపొచ్చింది అంటే .. మిగిలిన ప్రేక్షకులు సినిమా చూసి ఎలా ఫీల్ అయ్యుంటారో అర్థం చేసుకోగలను. నాని ప్రతిరోజు నన్ను ఇన్స్పైర్ చేస్తుంటాడు. తనను చూసిన ప్రతిసారి సినిమాకు, తనకు ఉన్న ప్రేమే నన్ను ఇన్స్పైర్ చేస్తుంటుంది. గౌతమ్ స్టోరీ టెల్లర్గా.. ఫిలింమేకర్‌గా జెర్సీతో అందరినీ టచ్ చేశాడు. యు టర్న్ నుంచి శ్రద్ధాశ్రీనాథ్‌కు నేను పెద్ద ఫ్యాన్‌ని. సినిమా అనేది శాశ్వతం. ఎంటైర్ టీంకు ఇదొక మెరిట్‌లా మిగిలిపోతుంది" అని రానా ఎమోషనల్ మాట్లాడారు.
సుమ ఎంటైరై.. పరుగులు తీసి!
రానా మాట్లాడుతుండగా మధ్యలో కలుగజేసుకున్న సుమ.. మీకు త్వరలోనే అమ్మాయిలు, పెళ్లి, పిల్లల గురించి బాగా అర్థం కావాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చారు. సుమ ఈ మాట అనగానే.. రానా చప్పున వచ్చి సుమ కాళ్లకు నమస్కరించే ప్రయత్నం చేశారు.. అది చూసిన సుమ కంగారుపడిపోయి కాళ్లు వెనక్కి లాగేసుకున్నారు. రానా నుంచి తప్పించుకునేందుకు వేదికపై పరుగులు తీశారు. మళ్లీ మైక్ పట్టిన సుమ.. అందరూ పెళ్లి చేసుకుని కష్టపడుతుంటే మీరు మాత్రం సుఖంగా ఉండాలా? అందుకే మీరు కూడా పెళ్లి చేసుకుని పిల్లల్ని కని, అమ్మాయిల మనసు అర్థం చేసుకోవాలంటూ రానాను కవ్వించేలా బదులిచ్చారు. రానా చేష్టలకు.. సుమ పరుగులు, మాటలకు సభికులను నవ్వుల్లో ముంచెత్తింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు, రానా అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout