నవంబర్ నుండి షురూ చేయనున్న రానా
Send us your feedback to audioarticles@vaarta.com
కోవిడ్ సమయంలో కొత్త పెళ్లి కొడుకైన వారిలో రానా దగ్గుబాటి ఒకరు. కోవిడ్ ప్రభావం తగ్గకపోయినప్పటికీ మన స్టార్స్ క్రమంగా కేంద్ర ప్రభుత్వ విధివిధానాలను పాటిస్తూ సినిమా షూటింగ్‌లను రీస్టార్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రానా దగ్గుబాటి హీరోగా చేస్తున్న ‘విరాటపర్వం’ సినిమా నవంబర్ నుండి రీస్టార్ట్ కానుందని వార్తలు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇప్పటికే సినిమా సగానికిపైగానే చిత్రీకరణను పూర్తి చేసుకుంది. మిగిలిన షూటింగ్ అంతటినీ సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.
ఇప్పటికే ఈ సినిమాలో సాయిపల్లవి లుక్‌తో పాటు నక్సలైజ్ భారతక్కగా నటిస్తున్న ప్రియమణి లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. రానా లుక్ కూడా విడుదలైంది కానీ.. ఆయన పాత్రకు సంబంధించి పలు వార్తలు వినిపిస్తున్నాయి. రానా పోలీస్ ఆఫీసర్ అని, రాజకీయ నాయకుడని వార్తలు వినిపిస్తున్నాయి. వేణు ఊడుగుల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరితో పాటు సురేశ్‌బాబు ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఇంకా జరీనా వహాబ్, నందితాదాస్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సినిమా విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout