బాబాయి కేసును రీ ఓపెన్ చేయనున్న రానా?
Send us your feedback to audioarticles@vaarta.com
‘దృశ్యం’ సినిమా సింపుల్‌గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. మలయాళం రీమేక్ అయిన ఈ సినిమా.. తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కింది. థ్రిల్లర్ జోనర్‌లో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే మలయాళం ఈ సినిమాకు సీక్వెల్ కూడా వచ్చింది. ఒక సక్సెస్ సాధించిన చిత్రానికి సీక్వెల్ అంటే మామూలు విషయం కాదు.. ఏమాత్రం అటు ఇటు అయినా సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతుంది. కానీ ఈ చిత్రానికి సంబంధించిన సీక్వెల్‌ను దర్శకుడు జీతూ జోసెఫ్ టాకిల్ చేసిన తీరు అద్భుతం.
‘దృశ్యం’ సినిమాకు మించి ‘దృశ్యం 2’ ఆకట్టుకుందనడంలో సందేహం లేదు. బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. దీంతో ఈ సినిమా తెలుగులో కూడా రీమేక్‌కు సిద్ధమైంది. విక్టరీ వెంకటేష్, మీనా జంటగా ఈ సీక్వెల్ కూడా రూపొందుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో బాబాయి, అబ్బాయి కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. మలయాళంలో ఈ చిత్రంలో సురేష్ గోపి నటించిన కొత్త ఇన్‌స్పెక్టర్ పాత్రలో రానా నటించబోతున్నాడని టాలీవుడ్ టాక్.
‘దృశ్యం’ సినిమా చూసిన వారెవ్వరూ దాని కథను మరచిపోలేరు. ఈ సినిమాలో ఓ యువకుడు వెంకటేష్ కూతురిని వేధించి, ఆయన చేతిలోనే హత్యకు గురవుతాడు. ఆ హత్య చేసింది ఎవరో పోలీసులు తెలుసుకోలేకపోతారు. చివరికి కేసు క్లోజ్ అయిపోతుంది. ‘దృశ్యం 2’లో కొత్త ఇన్‌స్పెక్టర్ చార్జ్ తీసుకున్నాక కేసుని రీ ఓపెన్ చేస్తారు. మళ్లీ అమ్మాయి తండ్రి రాంబాబు కేసు నుంచి తప్పించుకోవడానికి ప్లాన్‌లు మొదలుపెడతాడు. రాంబాబు పాత్రలో వెంకటేశ్ తిరిగి మెప్పించనున్నారు. ఈ సీక్వెల్‌కు సైతం జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com