మరో కొత్త పాత్రలో రానా..
Send us your feedback to audioarticles@vaarta.com
తొలి చిత్రం నుండి విలక్షణమైన పాత్రలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్న యంగ్ హీరో రానా, త్వరలోనే నేనే రాజు-నేను మంత్రి సినిమాలో సరికొత్త పాత్రలో కనపడుతున్నాడు. తేజ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో రానా రాయలసీమ ప్రాంతానికి చెందిన ఫైనాన్సియర్ పాత్రలో కనపడబోతున్నాడట. ఈ పాత్రకు, పొలిటిక్స్‌కు లింక్ ఉండేలా దర్శకుడు తేజ రానా పాత్రను చాలా ఆసక్తికరంగా డిజైన్ చేశాడట. బాహుబలి చిత్రంలో భళ్ళాళదేవుడుగా నటించిన రానా, ఘాజీతో నేవీ ఆఫీసర్‌గా మెప్పించాడు. మరి నేనే రాజు-నేనే మంత్రి చిత్రంలో ఎలా ఆకట్టుకుంటాడో చూద్దాం..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com