ప్రేయ‌సి ఫొటో షేర్ చేసి షాకిచ్చిన రానా!!

  • IndiaGlitz, [Tuesday,May 12 2020]

టాలీవుడ్ హీరో రానా ద‌గ్గుబాటి ఈరోజు త‌న స్నేహితుల‌కు, అభిమానుల‌కు పెద్ద షాకే ఇచ్చాడు. ఇంత‌కూ రానా ఇచ్చిన షాకేంటో తెలుసా? ఓ అమ్మాయితో దిగిన ఫొటోను షేర్ చేసిన రానా ఆమె ఓకే చెప్పింది అంటూ మెసేజ్ కూడా పోస్ట్ చేశాడు. ఆమె పేరు మిహికా బ‌జాజ్ అని తెలిపారు. ఈ ఫొటో ఇప్పుడు నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది. హీరోలు, హీరోయిన్స్ అంద‌రూ రానాకు అభినంద‌నలు తెలియ‌జేస్తున్నారు. శృతిహాస‌న్‌, స‌మంత‌, కియారా అద్వానీ, రాశీ ఖ‌న్నా, హ‌న్సిక త‌దిత‌రులు రానాకు అభినంద‌న‌లు తెలిపారు. రామ్‌చ‌ర‌న్ స‌తీమ‌ణి ఉపాస‌న ఓ మైగాడ్ అంటూ శుభాకాంక్ష‌లు చెబితే మై మెన్.. ఎంగేజ్డ్ గ్యాంగ్‌లోకి స్వాగ‌తం అని నిఖిల్ అన్నారు.

ఈ ఫోటోను రానా ప్ర‌త్యేకంగా షేర్ చేశారంటే త్వ‌ర‌లోనే రానా ఓ ఇంటివాడు కాబోతున్నాడ‌ని అర్థ‌మ‌వుతుంది. మిహీక బ‌జాజ్ స్వ‌స్థ‌లం హైద‌రాబాద్‌. ఆమె డ్యూ డ్రాప్ స్టూడియో అనే ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ‌ను న‌డుపుతున్నారు. రానా సినిమాల విష‌యానికి వ‌స్తే ఈయ‌న టైటిల్ పాత్ర‌లో న‌టించిన ఆరణ్య విడుద‌ల‌కు సిద్ధంగా ఉండ‌గా.. మ‌రో ప‌క్క సాయిప‌ల్ల‌వితో క‌లిసి వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో విరాట‌ప‌ర్వం 1992 సినిమాలో రానా న‌టిస్తున్నారు.

More News

ప‌వ‌న్ 28లో మ‌ల‌యాళీ ముద్దుగుమ్మ‌..?

త‌దుప‌రి ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఉండ‌టంతో జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ సైలెంట్‌గా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వ‌డ‌మే కాకుండా శ‌ర‌వేగంగా సినిమాల‌ను పూర్తి చేసే ప‌నిలో ప‌డ్డాడు.

ఈసారి 'రాములో రాముల..' అంటోన్న డేవిడ్ వార్నర్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన హ్యాట్రిక్ చిత్రం ‘అల వైకుంఠ‌పుర‌ములో’. ఈ సినిమా వ‌సూళ్ల ప‌రంగా నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను సాధించింది.

అనారోగ్యంపై వచ్చిన వార్తలపట్ల కేటీఆర్ క్లారిటీ..

తెలంగాణ మంత్రి కేటీఆర్ అనారోగ్యంగా ఉన్నారని.. గత రెండు మూడ్రోజులుగా ఆయన బాధపడుతున్నారని వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.

కరోనా నుంచి కోలుకుంటున్న ఏపీ.. కేసులు తగ్గిపోతున్నాయ్!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ కోలుకుంటోంది. ఇందుకు నిదర్శనమే గత నాలుగైదు రోజులుగా నమోదవుతున్న కేసులు.

మోదీ ఏం చెప్పబోతున్నారు.. దేశ ప్రజల్లో సర్వత్రా ఆసక్తి!

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో.. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ రాత్రి 08 గంటలకు జాతినుద్ధేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం