నేనే రాజు, మంత్రినంటున్న రానా
Send us your feedback to audioarticles@vaarta.com
ఒకప్పుడు ప్రేమకథాచిత్రాల స్పెషలిస్టుగా పేరు పొంది బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్న దర్శకుడు తేజ తర్వాత చేసిన సినిమాలేవీ అనుకున్న స్థాయిలో సక్సెస్‌ను తెచ్చి పెట్టలేకపోయాయి. అయితే చాలా గ్యాప్ తీసుకున్న తేజ ఇప్పుడు రానా దగ్గుబాటి, కాజల్, క్యాథరిన్ హీరో హీరోయిన్లుగా ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.
రానా కూడా సినిమా స్క్రిప్ట్ విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సంగతి తెలిసిందే. అయితే రానాకున్న కమిట్ మెంట్స్‌తో సినిమా సెట్స్‌లోకి వెళ్లడానికి టైం తీసుకుందంతే. ఇప్పుడు ఈ కొత్త సినిమా అక్టోబర్ నుండి సెట్స్ లోకి వెళ్లనుందని సమాచారం. ఈ సినిమాకు `నేనే రాజు-నేనే మంత్రి` అనే టైటిల్‌ను రిజిష్టర్ చేయించారట. ఈ సినిమాతో అయినా తేజ హిట్ ట్రాక్‌లో పడతాడో లేదో మరి...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments