ఆ బాధ్యత మనపైనే ఉంటుంది - రానా

  • IndiaGlitz, [Monday,July 11 2016]

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కె.సి.ఆర్ ఇచ్చిన హ‌రిత‌హారం పిలుపుకు సినీ ప్ర‌ముఖుల నుంచి విశేష స్పంద‌న ల‌భిస్తుంది. యువ హీరో ద‌గ్గుబాటి రానా కూడా హ‌రిత‌హారం కార్య‌క్ర‌మానికి మ‌ద్ద‌తు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా నానక్ రామ్ గూడ‌లో రానా రెండు మొక్క‌లు నాటారు.ఈ సంద‌ర్భంగా రానా స్పందిస్తూ... ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసం ప్ర‌తి ఒక్క‌రు మొక్క‌లు నాటాలి. అలాగే మొక్క‌లు నాట‌డంతో పాటు నాటిన మొక్క‌ల‌ను ప‌రిర‌క్షించాల్సిన బాధ్య‌త మ‌న‌పై ఉంద‌న్నారు. అలాగే త‌ను మొక్క‌లు నాటిన విష‌యాన్ని ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేస్తూ...హ‌రిహారం కార్య‌క్ర‌మంలో భాగంగా అంద‌రూ మొక్క‌లు నాటాల‌ని పిలుపునిచ్చారు.

More News

హ‌రిత హారం లో.. అక్కినేని ఫ్యామిలీ

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన హ‌రిత హారం కార్య‌క్ర‌మానికి సినీ ప్ర‌ముఖుల నుంచి విశేష స్పంద‌న ల‌భిస్తుంది. స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డే మంచి కార్య‌క్ర‌మాలు చేయ‌డంలో ఎప్పుడూ ముందుండే అక్కినేని ఫ్యామిలీ హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంలో కూడా ముందుండి ఎంతో మందికి స్పూర్తి నిచ్చారు.

'డా.చక్రవర్తి' పాటలు విడుదల

అదృష్టం, ఎ ఫిలిం బై అర‌వింద్‌, అర‌వింద్‌, త్రీ` వంటి విల‌క్ష‌ణ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ సూరి డైరెక్ష‌న్‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర మూవీస్ బ్యాన‌ర్‌పై రిషి, సోనియా మాన్‌, గిరీష్‌, లీనా, వంశీ ప్ర‌ధాన తారాగ‌ణంగా ఎ.వెంక‌టేశ్వ‌ర్లు(చాంఫ్‌), ర‌త్న‌మాల రెడ్డి, శేఖ‌ర్ సూరి నిర్మిస్తోన్న చిత్రం డా.చ‌క్ర‌వ‌ర్తి.

ఘనంగా హీరో విక్రమ్ కుమార్తె నిశ్చితార్థం

డిఫరెంట్ కథలతోనే కాదు,గెటప్ లతో కూడా ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న హీరో చియాన్ విక్రమ్.

తలకోనలో రోబో సీక్వెల్.....

సూపర్ స్టార్ రజనీకాంత్,అక్షయ్ కుమార్,శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న రోబో సీక్వెల్ 2.0

మన భాషని, యాసని మరచిపోకూడదు అందుకే సినిమాల ద్వారా సంప్రదాయాల్ని ప్రొత్సహిస్తాను-UKTA 6 వ వార్షికోత్సవంలో పవన్

యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు అసోసియేషన్(UKTA)ఆరవ వార్షికోత్సవ వేడుకలు జయతే కూచిపూడి,జయతే బతుకమ్మ సాంస్కృతిక వేడుకలు లండన్ త్రాక్సిలో ఘనంగా నిర్వహించారు.