రానాతో సాయిధరమ్ తేజ్ పోటీ..

  • IndiaGlitz, [Saturday,November 26 2016]

రానా, సాయిధ‌ర‌మ్‌తేజ్‌లు ఒకేసారి పోటీలోకి దిగుతున్నారు..ఇంత‌కీ ఆ పోటీ ఎంట‌నుకుంటున్నారా..ఇత‌ర పోటీలేం కాదు కానీ త‌మ సినిమాల‌తో ఇద్ద‌రు హీరోలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పోటీకి రెడీ అవుతున్నారు. మొద‌టి ప్ర‌పంచ యుద్ధ నేప‌థ్యంలో స‌బ్‌మెరెన్ 'ఘాజీ' సినిమా రూపొందింది.

పివిపి బ్యాన‌ర్‌లో రూపొందుతోన్న ఈ సినిమాను ఫిభ్ర‌వ‌రి 24న విడుద‌ల చేస్తున్నారు. సినిమా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు ప్రారంభ‌మ‌య్యాయి. అలాగే సాయిధ‌ర‌మ్ తేజ్‌, ర‌కుల్ జంట‌గా గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'విన్న‌ర్' ఈ సినిమాను న‌ల్ల‌మ‌లుపు బుజ్జి, ఠాగూర్ మ‌ధులు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను కూడా నిర్మాత‌లు ఫిభ్ర‌వ‌రి 24న విడుద‌ల చేయాల‌నుకుంటున్నారు.