ముత్తయ్య బయోపిక్కు నిర్మాతగా రానా
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ కూడా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి ప్రధాన పాత్ర పోషించనున్నాడు. ఇక ఈ మూవీకి ‘800’ అనే టైటిల్‌ను కూడా దాదాపు ఖరారు చేశారు. మురళీధరన్ టెస్ట్ కెరీర్లో ‘800’ వికెట్లు పడగొట్టి తనకంటూ హిస్టరీ క్రియేట్ చేసుకున్నాడు. దీంతో సినిమా టైటిల్ కూడా ‘800’ ఫిక్స్ చేశారని సమాచారం. ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభంకానుంది.
అయితే ఈ చిత్రం ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహిస్తుండగా.. ‘దార్ మీడియా ప్రొడక్షన్స్’ నిర్మిస్త్తోంది. తాజాగా ఈ నిర్మాణంలో సురేష్ ప్రొడక్షన్స్ కూడా భాగస్వామ్యం అయ్యింది. ఈ చిత్రంలో భాగస్వామ్యం కావడం చాలా ఆనందం ఉన్నదని దగ్గుబాటి రానా తన ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు. ఈ ట్వీట్‌ను విజయ్‌సేతుపతి, ముత్తయ్య మురళీధరన్, సురేష్ ప్రొడక్షన్స్, దార్ మీడియాకు రానా ట్యాగ్ చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ముత్తయ్య సినిమాకు రానా నిర్మాతగా మారారన్న మాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout