కొత్త పాత్రలో రానా
Send us your feedback to audioarticles@vaarta.com
తొలి చిత్రం లీడర్` నుండి రానా డిఫరెంట్ సినిమాలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్నాడు. తెలుగులో కాకుండా తమిళం, హిందీలో కూడా ప్రేక్షకులకు సుపరిచితుడయ్యాడు. రీసెంట్ గా బాహుబలి`లో భల్లాలదేవగా మెప్పించిన రానా ఇప్పుడు దాని సీక్వెల్ కి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే నావీ కథతో రూపొందునున్న చిత్రంలో రానా నటించనున్నాడు.
1971లో ఇండో పాక్ యుద్ధంలో పాకిస్థాన్ కి చెందిన ఘాజి అనే సబ్ మెరైన్ సముద్రంలో గల్లంతయ్యింది. ఆ కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందనుందట. సంకల్ప్ అనే ఫిలిం మేకర్ చెప్పిన కథ నచ్చడంతో రానా ఈ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నాడట. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ కమాండర్ పాత్రలో నటిస్తున్నాడని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments