ఆగస్ట్ లో రానా 'నేనే రాజు - నేనే మంత్రి'

  • IndiaGlitz, [Sunday,April 16 2017]

డిఫ‌రెంట్ చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కే కాదు, త‌మిళ‌, హిందీ ప్రేక్ష‌కుల‌కు కూడా సుప‌రిచిత‌మైన న‌టుడు రానా. ఏప్రిల్ 28న 'బాహుబ‌లి 2'తో భ‌ళ్ళాల‌దేవుడుగా సంద‌డి చేయ‌బోతున్నాడు. బాహుబ‌లి 2 చిత్రీక‌ర‌ణ‌తో పాటు తేజ ద‌ర్శ‌క‌త్వంలో రానా నేనే రాజు నేనే మంత్రి అనే పొలిటిక్ ఎంట‌ర్టైన‌ర్‌లో న‌టించాడు. ఈ సినిమాలో రానా రాయ‌ల‌సీమ‌కు చెందిన ఓ ఫైనాన్సియ‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌బోతున్నాడు. కాజ‌ల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమాను ఆగ‌స్ట్ నెల‌లో ఇండిపెండెన్స్ డే సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమాను సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తుంది.