రానా విడుదల చేసిన 'కాదలి' టీజర్
Send us your feedback to audioarticles@vaarta.com
ఆసక్తికరమైన ట్రైయాంగులర్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న చిత్రం "కాదలి". అందరూ కొత్తవారితో రూపొందిన ఈ చిత్రం కాన్సెప్టే "రెస్పెక్ట్ హర్ ఛాయిస్". యూత్ ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా రూపొందిన ఈ చిత్రం టీజర్ ను ఈరోజు నేడు రానా దగ్గుబాటి విడుదల చేసారు.
అనగనగా సినిమా పతాకంపై పట్టాభి ఆర్. చిలుకూరి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం డిఫెరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతుంది.
టీజర్ విడుదల సందర్భంగా దర్శకనిర్మాత పట్టాభి ఆర్.చిలుకూరి మాట్లాడుతూ.. "మా "కాదలి" టైటిల్ కు విశేషమైన స్పందన వచ్చింది. మినిష్టర్ కేటీయార్ గారు విడుదల చేసిన టైటిల్ కు లోగోకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు రానా మా సినిమా టీజర్ ను విడుదల చేయడం సంతోషంగా ఉంది. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ట్రైలర్ మరియు ఆడియోను విడుదల చేసి.. జూన్ లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.
పూజ కె.దోషి, హరీష్ కళ్యాణ్, సాయి రోనక్, సుదర్శన్, మోహన్ రామన్, డా.మంజరి షర్మిల, గురురాజ్ మానేపల్లి, పల్లవి బానోతు, భాను అవిరినేని, సి.సురేష్ కుమార్, సంధ్యా జనక్, రమాదేవి ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, కొరియోగ్రఫీ: రాజు సుందరం-నోబెల్-శ్రీక్రిష్, పాటలు: వనామాలి, కాస్ట్యూమ్స్: ప్రియదర్శిని.టి, లైన్ ప్రొడ్యూడర్: పునాటి శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆనంద్ రంగా, కళ: వివేక్ అన్నామలై, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, సంగీతం: ప్రసన్ ప్రవీణ్ శ్యామ్, సినిమాటోగ్రఫీ: శేఖర్ వి.జోసెఫ్, రచన-నిర్మాణం-దర్శకత్వం: పట్టాభి ఆర్.చిలుకూరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com