కేరళలో 'విరాటపర్వం' షూటింగ్‌ లో రానా

  • IndiaGlitz, [Sunday,January 19 2020]

హ్యాండ్సం హీరో రానా దగ్గుబాటి తన తాజా చిత్రం 'విరాటపర్వం' షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం కేరళలో ప్రధాన తారాగణంపై కొన్ని ప్రధాన సన్నివేశాల్ని దర్శకుడు వేణు ఊడుగుల చిత్రీకరిస్తున్నారు. నాయికగా నటిస్తున్న సాయిపల్లవితో పాటు, ఒక కీలక పాత్ర చేస్తున్న ప్రియమణి సైతం ఈ చిత్రీకరణలో పాల్గొంటున్నారు.

రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తయారవుతున్న ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలను పేరుపొందిన హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ స్టీఫెన్ రిచర్ ఆధ్వర్యంలో చిత్రీకరించనున్నారు.

'నీదీ నాదీ ఒకే కథ' ఫేమ్ వేణు ఊడుగుల డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని డి. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రియమణి, ఈశ్వరీ రావు, జరీనా వహాబ్ కీలక పాత్రధారులైన ఈ సినిమాకు డాని సాంచెజ్-లోపెజ్ చాయాగ్రాహకునిగా పనిచేస్తున్నారు. 2020 వేసవిలో 'విరాటపర్వం'ను విడుదల చేయాలని నిర్మాతలు సంకల్పించారు.

More News

ఆమెను మ‌రోసారి విల‌క్ష‌ణ పాత్ర‌లో ప్రెజెంట్ చేయ‌నున్న సుకుమార్‌

`రంగ‌స్థ‌లం` వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత డైరెక్ట‌ర్ సుకుమార్ మ‌రో సినిమాను తెర‌కెక్కించ‌లేదు. బ‌న్నీతో సినిమా చేయ‌డానికి ఎదురు చూస్తున్నాడు.

బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న డ‌స్కీ బ్యూటీ..ఎవ‌రితో జ‌త క‌డుతుందో తెలుసా?

టాలీవుడ్‌లో అంతంత మాత్రంగా అవ‌కాశాల‌తో స‌త‌మ‌వుతూ వ‌చ్చిన డ‌స్కీ బ్యూటీ ఈషారెబ్బాకు పెద్ద అవ‌కాశ‌మే ద‌క్కింది.

`RRR` విడుద‌ల తేదీపై రాజ‌మౌళి తెలివిగా ప్ర‌వ‌ర్తిస్తున్నాడా?

ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ప్ర‌స్తుతం తెర‌కెక్కిస్తోన్న చిత్రం `RRR`. `బాహుబ‌లి` వంటి సెన్సేష‌న‌ల్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం

గోవాలో సొంతిల్లు.. సమంత కోరిక ఇదేనట!

సొంతిల్లు అంటే ఎవరికైనా మక్కువే. జీవితకాలంలో తనకంటూ ఓ ఇల్లు ఉండాలని ఎవరైనా భావిస్తుంటారు.

జగన్ పిలిచి పదవి ఇస్తానంటే.. పోసాని చెప్పిన మాటేంటో తెలుసా?

సినీ ఇండస్ట్రీలో పోసాని కృష్ణమురళీ ఎంత పాపులరో అందరికీ తెలిసిన విషయమే. రచయితగా, దర్శకుడిగా, నటుడిగా ఆయన విలక్షణమైన పాత్రలను పోషించారు.