అనంత‌పురంలో రానా..!

  • IndiaGlitz, [Wednesday,January 04 2017]

ద‌గ్గుబాటి రానా హీరోగా తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై సురేష్ బాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఇప్ప‌టి వ‌ర‌కు 50% షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం అనంత‌పురంలోని ఉర‌వ‌కొండ‌లో ప్ర‌భుత్వ జూనియ‌ర్ కాలేజీలో ఈ సినిమా షూటింగ్ చేస్తున్నారు. స్వ‌తంత్ర అభ్య‌ర్ధిగా రానా ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడే స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు.

ఉర‌వ‌కొండ ప్రాంతానికి చెందిన నాయ‌కులు ఎంపీపీ సుంకు ర‌త్న‌మ్మ‌, తెలుగు యువ‌త అధికార ప్ర‌తినిధి శ్రీనివాసులు త‌దిత‌రులు రానాతో క‌లిసి న‌టించారు. రానా వ‌చ్చాడు... షూటింగ్ చేస్తున్నారు అని తెలియ‌గానే స్ధానిక యువ‌త భారీ స్ధాయిలో త‌ర‌లి రావ‌డంతో పోలీసుల‌కు కంట్రోల్ చేయ‌డం క‌ష్ట‌మైంది. మ‌రో మూడు రోజులు పాటు ఉర‌వ‌కొండ‌లో షూటింగ్ నిర్వ‌హించ‌నున్నార‌ని స‌మాచారం.