400 ట్రైబల్ కుటుంబాలకు అండగా భల్లాల దేవుడు!
- IndiaGlitz, [Wednesday,June 09 2021]
కరోనా విపత్కర పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా తమ దాతృత్వం చాటుకుంటున్నారు. తాజాగా ఆరడుగుల ఆజాన బాహుడు రానా దగ్గుబాటి అద్భుతమైన సాయం అందించి తన గొప్ప మనసు చాటుకున్నాడు.
ఇదీ చదవండి: యంగ్ డైరెక్టర్ కు మైత్రి బంపర్ ఆఫర్.. రాంచరణ్ తో మూవీ!
సాయం చేయడంలో కూడా రానా అద్భుతమైన ఆలోచన చేశాడు. తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో ఆదివాసీల తండాలు ఎక్కువగా ఉన్నాయి. ఆదివాసీలు నివసించే గ్రామాల్లో సాధారణ పరిస్థితులలో కూడా నిత్యావసరాల కోసం ప్రజలు ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అలాంటిది ఈ విపత్కర సమయంలో వారి దయనీయ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ఈ ఆలోచనే రానా మదిలో మెదిలింది. వారిని ఆదుకునేందుకు తనవంతుగా ఏమైనా చేయాలని ముందుకు వచ్చాడు. నిర్మల్ జిల్లాలో దాదాపు 400 కుటుంబాలకు రానా నిత్యావసర సరుకులు, అవసరమైన మెడిసిన్స్ అందించాడు.
అడ్డాల తిమ్మాపూర్, మధిర, చింతల గూడెం, గొంగురం లాంటి గ్రామాలకు రానా సాయం అందించాడు. సినిమాల విషయానికి వస్తే.. రానా ఈ ఏడాది ఆసక్తికరమైన మూవీస్ లో నటిస్తున్నాడు. వేణు ఊడుగుల దర్శకత్వంలో విరాటపర్వం చిత్రంలో రానా నటిస్తున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలసి అయ్యప్పన్ కోషియం చిత్రంలో తన స్క్రీన్ షేర్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే.