ఆ డైరెక్టర్ కి రానా గ్రీన్ సిగ్నల్...

  • IndiaGlitz, [Friday,December 04 2015]

లీడ‌ర్ సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మైన ద‌గ్గుబాటి రానా ఆత‌ర్వాత సోలో హీరోగా నా ఇష్టం, నేను నా రాక్ష‌సి త‌దిత‌ర చిత్రాలు చేసినా క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ మాత్రం రాలేదు. అయితే బాహుబ‌లి సినిమా త‌ర్వాత రానా ఇమేజ్ ఒక్క‌సారిగా పెరిగిపోయింది. ఇప్పుడు సోలో హీరోగా సినిమా చేసి స‌క్సెస్ సాధించాల‌నుకుంటున్నాడు.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే...రానా వ‌రుస‌గా రెండు ప్లాప్ మూవీస్ అందించిన డైరెక్ట‌ర్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌. ఇంత‌కీ ఆ ప్లాప్ డైరెక్ట‌ర్ ఎవ‌ర‌నుకుంటున్నారా..? ఆయ‌నే శ్రీను వైట్ల‌. అవును..శ్రీను వైట్ల‌తో ఇప్ప‌డు సినిమా చేయ‌డానికి స్టార్ హీరోలు ఎవ‌రు ముందుకు రావ‌డం లేదు. దీంతో శ్రీను..రానా కోసం ఓ క‌థ రెడీ చేసి చెప్పాడ‌ట‌. క‌థ విని రానా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. మ‌రి..ఇదే క‌నుక నిజ‌మైతే రానా ని శ్రీను వైట్ల ఎలా చూపిస్తాడో చూడాలి.