తరుణ్ భాస్కర్‌తో రానా?
Send us your feedback to audioarticles@vaarta.com
రానా దగ్గుబాటి ఇప్పుడు హథీ మేరా సాథీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత వస్తాదు కోడి రామమూర్తి బయోపిక్‌లో నటించబోతున్నారు. కాగా రానా ఇప్పుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడట.
సురేశ్ ప్రొడక్షన్‌లో తరుణ్ భాస్కర్ మూడు సినిమాలను డైరెక్ట్ చేయబోతున్నారు. అందులో ఒకటి 'ఈ నగారానికి ఏమైంది?' సినిమా పూర్తయ్యింది. ఈ నెల 29న విడుదలవుతుంది. కాగా తరుణ్ ఈ బ్యానర్‌లో రెండు సినిమాలు చేయాల్సి ఉంది. అందులో రానాకు సరిపోయే ఓ స్క్రిప్ట్‌ను తయారు చేస్తున్నాడని టాక్.
అయితే రానా ప్రస్తుతం ఉన్న కమిట్‌మెంట్స్ పూర్తయిన తర్వాతే ఈ సినిమా లైన్‌లోకి వస్తుంది. ఈలోపు సురేశ్‌బాబు, తరుణ్‌తో మరో సినిమాను పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com