15 ఏనుగులతో రానా సందడి
Send us your feedback to audioarticles@vaarta.com
విభిన్నమైన కథలతో...భిన్నమైన నటనతో ఇండస్ట్రీని, ప్రేక్షకులని తనవైపు తిప్పుకున్న యువ నటుడు దగ్గుబాటి రానా. ఎంచుకునే ప్రతీ కథలోనూ.. తనదైన ముద్ర వేస్తూ ఇటీవల వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు రానా. కాగా, ప్రస్తుతం ఏనుగుల నేపథ్యంతో సాగే కథలో ఒక విభిన్నమైన పాత్రలో రానా నటిస్తున్నారు. 70వ దశకంలో హిందీలో వచ్చిన సూపర్ హిట్ మూవీ హాథీ మేరే సాథీ` ఆధారంగా అదే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాకి ప్రభు సాల్మోన్ దర్శకత్వం వహిస్తున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో ఏనుగులతో కలిసి నటించే సన్నివేశాలు ఉండడంతో....వాటిని మచ్చిక చేసుకునేందుకు రానా 15 నుంచి 20 రోజులు కేటాయించినట్లు తెలుస్తోంది. రానాతో పాటు సుమారు 15 ఏనుగులు చిత్రీకరణలో పాల్గొననున్నాయి. ఈ నెల చివరి వారంలో “థాయిలాండ్” అడవుల్లో షూటింగ్ మొదలుకానుంది. అనుకున్న టైంకే చిత్రీకరణ మొదలుపెట్టడానికి చిత్ర బృందం తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రస్తుతం రానా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ద్విభాషా చిత్రం 1945`తో బిజీగా ఉన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments