రానా ఈ సారైనా..?
Send us your feedback to audioarticles@vaarta.com
అదేమి విచిత్రమో కానీ.. కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చిన రానా ప్రతినాయకుడిగానే విజయాన్ని అందుకున్నాడు. గతేడాది విడుదలై సంచలన విజయం సాధించిన 'బాహుబలి'లో భళ్లాల దేవగా రానా నటనకు విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు లభించాయి. ప్రస్తుతం ఆ సినిమా సీక్వెల్‌తో పాటు ఇతర భాషల్లో అతిథి పాత్రలతో బిజీగా ఉన్నాడు రానా. అలాగే అతి త్వరలో తేజ దర్శకత్వం వహిస్తున్న కొత్త చిత్రంలోనూ హీరోగా నటించనున్నాడు.
ఇందులో అతనికి జోడీగా కాజల్ దర్శనమివ్వనుంది. ఇప్పటివరకు రానాతో జోడీ కట్టిన ఏ టాప్ హీరోయిన్ కూడా అతనికి అచ్చి రాలేదు. ఇలియానా, జెనీలియా, నయనతార, అనుష్క.. ఇలా రానా పక్కన అగ్ర కథానాయికలు నటించిన ప్రతిసారి అతనికి విజయం గానీ, ప్రశంసలు గానీ దక్కలేదు. ఈ నేపథ్యంలో కాజల్ కాంబినేషన్‌తోనైనా రానాకి ఈ రెండూ లభిస్తాయో చూడాలంటున్నారు విశ్లేషకులు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments