రానా ఈ సారైనా..?

  • IndiaGlitz, [Saturday,May 14 2016]

అదేమి విచిత్ర‌మో కానీ.. క‌థానాయ‌కుడిగా ఎంట్రీ ఇచ్చిన రానా ప్ర‌తినాయ‌కుడిగానే విజ‌యాన్ని అందుకున్నాడు. గ‌తేడాది విడుద‌లై సంచ‌ల‌న‌ విజ‌యం సాధించిన 'బాహుబ‌లి'లో భ‌ళ్లాల దేవ‌గా రానా న‌ట‌న‌కు విమ‌ర్శ‌కుల‌తో పాటు ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు ల‌భించాయి. ప్ర‌స్తుతం ఆ సినిమా సీక్వెల్‌తో పాటు ఇత‌ర భాష‌ల్లో అతిథి పాత్ర‌ల‌తో బిజీగా ఉన్నాడు రానా. అలాగే అతి త్వ‌ర‌లో తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న కొత్త చిత్రంలోనూ హీరోగా న‌టించ‌నున్నాడు.

ఇందులో అత‌నికి జోడీగా కాజ‌ల్ ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది. ఇప్ప‌టివ‌ర‌కు రానాతో జోడీ క‌ట్టిన ఏ టాప్ హీరోయిన్ కూడా అత‌నికి అచ్చి రాలేదు. ఇలియానా, జెనీలియా, న‌య‌న‌తార‌, అనుష్క‌.. ఇలా రానా ప‌క్క‌న అగ్ర క‌థానాయిక‌లు న‌టించిన ప్ర‌తిసారి అత‌నికి విజ‌యం గానీ, ప్ర‌శంస‌లు గానీ ద‌క్క‌లేదు. ఈ నేప‌థ్యంలో కాజ‌ల్ కాంబినేష‌న్‌తోనైనా రానాకి ఈ రెండూ ల‌భిస్తాయో చూడాలంటున్నారు విశ్లేష‌కులు.

More News

'జనతాగ్యారేజ్ ' కి కూడా అలాగే..

'టెంపర్','నాన్నకు ప్రేమతో'చిత్రాల కోసం వైవిధ్యమైన పాత్రల్లో కనిపించి..అభిమానులతో పాటు ప్రేక్షకులను అలరించాడు ఎన్టీఆర్.

పవన్ లిస్ట్ లో మరొకరు చేరనున్నారా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ది మొదట్నుంచీ ఒకటే శైలి.తనతో బ్లాక్ బస్టర్స్ ఇచ్చినా..

విడుదల సన్నాహాల్లో 'వసుధైక 1957'

అరుణశ్రీ కంబైన్స్ పతాకంపై శ్రీమతి అరుణ సమర్పణలో నిడమలూరి శ్రీనివాసులు నిర్మిస్తున్న హారర్ ఎంటర్ టైనర్ 'వసుధైక 1957'.

50 రోజులు పూర్తి చేసుకున్న ఊపిరి - స్పందించిన నాగార్జున...

టాలీవుడ్ కింగ్ నాగార్జున-కోలీవుడ్ హీరో కార్తీ-మిల్కీబ్యూటీ తమన్నా కాంబినేషన్లో రూపొందిన భారీ మల్టీస్టారర్ ఊపిరి.

ఆ...అవకాశం రావడం అవార్డ్ కంటే ఎక్కువ - సమంత

సూపర్ స్టార్ మహేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్నభారీ చిత్రం బ్రహ్మోత్సవం.